#MeToo: రాఖీ సావంత్‌పై రూ.10 కోట్లకు దావా వేసిన తనుశ్రీదత్తా!

తనుశ్రీదత్తా డ్రగ్స్ తీసుకుని వ్యానులో స్పృహ లేకుండా పడి ఉంటే... తాను పాట పూర్తిచేశానని చెప్పిన రాఖీసావంత్... తన ఇమేజ్ డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు చేసిన రాఖీపై పరువు నష్టం దావా వేసిన తనుశ్రీదత్తా!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 22, 2018, 5:27 PM IST
#MeToo: రాఖీ సావంత్‌పై రూ.10 కోట్లకు దావా వేసిన తనుశ్రీదత్తా!
తనుశ్రీదత్తా డ్రగ్స్ తీసుకుని వ్యానులో స్పృహ లేకుండా పడి ఉంటే... తాను పాట పూర్తిచేశానని చెప్పిన రాఖీసావంత్... తన ఇమేజ్ డ్యామేజ్ చేసే వ్యాఖ్యలు చేసిన రాఖీపై పరువు నష్టం దావా వేసిన తనుశ్రీదత్తా!
  • Share this:
‘మీటూ’ మూమెంట్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఒక్కసారిగా ఈ ఉద్యమం తెరపైకి రావడానికి ప్రధానకారణం సీనియర్ హీరోయిన్ తనుశ్రీదత్తా. సీనియర్ నటుడు నానా పటేకర్‌ మీద తనుశ్రీదత్తా చేసిన ‘లైంగిక వేధింపుల ఆరోపణలు’ బాలీవుడ్‌లో పను సంచలనం సృష్టించాయి. ఈ విషయంలో నానా పటేకర్‌కి మద్ధతుగా నిలిచారు. సెక్సీ బాంబ్ రాఖీసావంత్ కూడా ‘నానా పటేకర్ చాలా మంచివాడు’ అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేసింది. తనుశ్రీదత్తా కేవలం ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందంటూ కామెంట్ చేసింది రాఖీ. అంతటితో ఆగకుండా... ‘తనుశ్రీదత్తా డ్రగ్స్ తీసుకుని మత్తులో వ్యానులో పడుకుంటే...నానా పటేకర్ సలహాతో నేను ఓ సాంగ్ చేయాల్సి వచ్చింది’ అంటూ సాటి హీరోయిన్‌పై ఆరోపణలు చేసింది రాఖీ.

ఓ రోజు తనుశ్రీదత్తా డ్రగ్స్ తీసుకుని వ్యానులో 4 గంటల పాటు స్పృహ లేకుండా పడి ఉంది. ఎంతకీ లేవకపోవడంతో షూటింగ్ ఆగిపోకూడదని నన్ను పాట చేయాల్సిందిగా కోరారు నానా పటేకర్. అయితే తను చేయాల్సిన పాటను నేను పూర్తిచేసినందుకు తనుశ్రీ నాకు నోటీసులు కూడా పంపించింది. అయితే చిత్రయూనిట్ నాకు మద్ధుతుగా నిలవడంతో ఆ కేసు నుంచి బయటపడ్డాను. ఈరోజు పెద్దపెద్ద కబుర్లు చెబుతున్న తనుశ్రీదత్తా అసలు బాగోతం బయటపెట్టాలనే ఈ విషయం చెబుతున్నా...

రాఖీసావంత్, బాలీవుడ్ నటి


రాఖీసావంత్ వ్యాఖ్యలపై తనుశ్రీదత్తా తీవ్రంగా మండిపడింది. ‘నాకు ఇప్పుడు ఏ ప్రచారం అవసరం లేదు. సినిమా అవకాశాలు కోరుకోవడమూ లేదు. అమెరికాకు వెళ్లి సెటిల్ అవుతాను... నాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన రాఖీపై నేను చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నా...’ అంటూ చెప్పిన తనుశ్రీదత్తా, తన వ్యక్తిగత ఇమేజ్‌కి దెబ్బకలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు రాఖీసావంత్‌పై రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు తెలిపింది.
Published by: Ramu Chinthakindhi
First published: October 22, 2018, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading