#MeToo: సుభాష్ ఘయ్‌పై కేట్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

బాలీవుడ్ లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు సుభాష్ ఘ‌య్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది టీవీ న‌టి కేట్ శ‌ర్మ‌. ఇప్పుడు జ‌రుగుతున్న మీటూ ఉద్య‌మంలో ఈయ‌న పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. బాలీవుడ్ లో సంచ‌ల‌న సినిమాలు చేసిన సుభాష్ ఘ‌య్‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌న‌మే ఇప్పుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2018, 3:06 PM IST
#MeToo: సుభాష్ ఘయ్‌పై కేట్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
సుభాష్ ఘాయ్
  • Share this:
బాలీవుడ్ లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు సుభాష్ ఘ‌య్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది టీవీ న‌టి కేట్ శ‌ర్మ‌. ఇప్పుడు జ‌రుగుతున్న మీటూ ఉద్య‌మంలో ఈయ‌న పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. బాలీవుడ్ లో సంచ‌ల‌న సినిమాలు చేసిన సుభాష్ ఘ‌య్‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌న‌మే ఇప్పుడు. కానీ ఇవ‌న్నీ నిజ‌మే అంటున్నారు కొంద‌రు హీరోయిన్లు కూడా. ఇప్పుడు కేట్ శ‌ర్మ కూడా త‌న‌ను సుభాష్ ఘ‌య్ బ‌లవంతం చేసాడ‌ని.. ముద్దు పెట్టుకోడానికి ప్ర‌య‌త్నించాడ‌ని చెప్పింది.

#MeToo: సుభాష్ ఘయ్‌పై కేట్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. #MeToo: subhash ghai accused by television actress kate sharma..
సుభాష్ ఘాయ్


ఆగ‌స్ట్ 6న సుభాష్ ఘాయ్ త‌న‌ను ఇంటికి పిలిచాడ‌ని.. అప్పుడు ఇంట్లో దాదాపు ఆరుగురు ఉన్నార‌ని.. అంత‌మంది ముందే త‌న‌ను మెసేజ్ చేయాలంటూ సూచించాడ‌ని చెప్పింది కేట్. ఆ త‌ర్వాత త‌ను కూడా అలాగే చేసాన‌ని.. రెండు మూడు నిమిషాల త‌ర్వాత తాను వాష్ రూమ్‌కు వెళ్లిన త‌ర్వాత అక్క‌డికి వ‌చ్చి త‌న చేయి ప‌ట్టుకుని.. నీతో కాస్త మాట్లాడాల‌ని రూమ్ లోకి తీసుకెళ్లి.. త‌న‌ను బ‌లవంతంగా ముద్దు పెట్ట‌డానికి చూసాడ‌ని ఆరోపించింది కేట్ శ‌ర్మ‌. త‌న‌ను త‌ర్వాత ద‌గ్గ‌రికి లాక్కొని.. కౌగిలించుకున్నాడ‌ని తెలిపింది కేట్ శ‌ర్మ‌.

#MeToo: సుభాష్ ఘయ్‌పై కేట్ శ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. #MeToo: subhash ghai accused by television actress kate sharma..
సుభాష్ ఘాయ్


తాను బ‌య‌ట‌ప‌డ‌టానికి చూస్తే సుభాష్ ఘాయ్ త‌నను బెదిరించాడ‌ని తెలిపింది. త‌న‌తో రాత్రి గ‌డ‌ప‌క‌పోతే బాలీవుడ్ లో అవ‌కాశం రాద‌ని.. త‌ను లాంఛ్ చేయ‌న‌ని భ‌య‌పెట్టాడ‌ని తెలిపింది కేట్ శ‌ర్మ‌. ఆ త‌ర్వాత మ‌రో మ‌హిళ కూడా సోష‌ల్ మీడియాలో త‌న‌కు సుభాష్ ఘయ్ మ‌త్తు ఇచ్చి రేప్ చేసాడ‌ని తెలిపడం సంచ‌ల‌నం అయింది. ఇప్పుడు మ‌రోసారి ఘాయ్ పై కేట్ శ‌ర్మ ఇలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ వ్యాఖ్య‌ల‌ను సుభాష్ ఘాయ్ కుటుంబం మాత్రం కొట్టిపారేసింది. ఇప్ప‌టికే బాలీవుడ్ లో చాలా మంది ప్ర‌ముఖుల‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేసారు. ఇప్పుడు ఘాయ్ కూడా ఇందులో ప్ర‌ముఖంగా మారిపోయారు.
Published by: Praveen Kumar Vadla
First published: October 14, 2018, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading