Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 13, 2018, 5:34 PM IST
సల్మాన్ ఖాన్ పూజామిశ్రా
మీటూలోకి స్టార్ హీరోలు ఇంకా రాలేదేంటి.. మనోళ్లంతా అంత మంచోళ్లా ఏంటి అనుకుంటున్నారు ఇన్నాళ్లూ చాలా మంది. అయితే ఇప్పుడు ఈ ఆసక్తికి తెరదించుతూ ఏకంగా సల్మాన్ ఖాన్ పేరునే తీసుకొచ్చింది ఓ హీరోయిన్. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ పూజామిశ్రా ఈ ఆరోపణలు చేసింది. తనను లైంగికంగా సల్మాన్ ఖాన్.. అతడి సోదరులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ వేధించారని సంచలన కమెంట్స్ చేసింది ఈ బ్యూటీ.

సల్మాన్ ఖాన్ పూజామిశ్రా
అంతేకాదు.. తన లైఫ్‌కు కూడా వాళ్ల నుంచి డేంజర్ ఉందని చెప్పి బాంబు పేల్చింది పూజా. సల్మాన్ కుటుంబంతో పాటు శత్రుఘ్న సిన్హా కుటుంబంపై కూడా ఈ భామ ఆరోపణలు చేసింది. "సుల్తాన్" చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో తనపై హోటల్లో రేప్ చేసారని ఆరోపించింది ఈ భామ. ఇప్పుడే అసలు ఉద్యమం మొదలైందని.. ఇక నుంచి ప్రతీ ఒక్కరికి ఈ తిప్పలు తప్పవని.. ఓ మహిళతో ఇలా ప్రవర్తించిన సల్మాన్ అతడి సోదరులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని చెబుతుంది పూజా.

సల్మాన్ ఖాన్ పూజామిశ్రా
తన ఇన్ స్టాలో పెద్ద వీడియో ఒకటి ఈ ఇష్యూపై పోస్ట్ చేసింది పూజామిశ్రా. ఈ ఆరోపణలపై సల్మాన్‌తో పాటు అతడి కుటుంబం కూడా ఇంకా స్పందించాల్సి ఉంది. మరి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలిక. మరోవైపు సల్మాన్ ఫ్యాన్స్ అయితే పూజాపై రివర్స్ సెటైర్లు వేస్తున్నారు. కావాలనే తమ హీరోను ఇందులోకి లాగుతుందని ఆమెపై విరుచుకుపడుతున్నారు. మరి చూడాలిక.. సల్మాన్ ఖాన్ రచ్చ ఎంతదూరం వెళ్లనుందో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
October 13, 2018, 5:34 PM IST