#MeToo: హీరోయిన్ సంజనపై ఫిర్యాదు చేసిన డైరెక్టర్ రవిశ్రీవాస్తవ

అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టిన కన్నడ బ్యూటీ... ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో నటిపై ఫిర్యాదు చేసిన దర్శకుడు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 20, 2018, 6:38 PM IST
#MeToo: హీరోయిన్ సంజనపై ఫిర్యాదు చేసిన డైరెక్టర్ రవిశ్రీవాస్తవ
అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టిన కన్నడ బ్యూటీ... ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో నటిపై ఫిర్యాదు చేసిన దర్శకుడు!
  • Share this:
‘మీటూ’ మూమెంట్ అటు తిరిగి, ఇటు తిరిగి ఆరోపణలు చేస్తున్నవారి మెడకే చుట్టుకుంటోంది. ఆధారాలు లేకుండా లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు దర్శకనిర్మాతలు. సీనియర్ నటుడు అలోక్‌నాథ్, నానాపటేకర్ ఈ మార్గాన్నే ఎంచుకోగా తాజాగా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్న కన్నడ దర్శకుడు రవిశ్రీవాస్తవ కూడా ఇదే రూట్లో వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టి, తనపై ఆరోపణలు చేసిన హీరోయిన్ సంజనను చట్టపరంగా ఎదుర్కొవాలని డిసైడ్ అయ్యారు.

‘బుజ్జిగాడు’ సినిమాలో ప్రభాస్ మరదలి పాత్రలో నటించి, టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన. ఆ తర్వాత తెలుగులో అడపాదడపా సినిమాల్లో కనిపించినా, కన్నడ చిత్రసీమలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది సంజన. తెలుగులో ‘సత్యమేవ జయతే’, ‘సమర్థుడు’, ‘పోలీస్ పోలీస్’, ‘ముగ్గురు’ వంటి సినిమాల్లో కనిపించినా... పెద్దగా గుర్తింపు తెచ్చే పాత్ర మాత్రం దక్కలేదు. తాజాగా వెండి తెర మీద నుంచి బుల్లితెర మీదకి షిఫ్ట్ అవుతోంది సంజనా. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘స్వర్ణఖడ్గం’ సీరియల్‌లో లేడీ విలన్ పాత్రలో నటిస్తోంది.

గత ఏడాది విడుదలయ్యిన ‘దండుపాళ్యం 2’ సినిమాలో సంజన న్యూడ్ సీన్లు వివాదాస్పదమయ్యాయి. సినిమా అవకాశాల కోసం సంజన మరీ ఇంత దిగజారిందంటూ విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయ్యింది సంజన. ‘దండుపాళ్యం 3’ తర్వాత కన్నడ సీమను వదిలేసి, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే కొన్నాళ్ల క్రితం తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రకటించింది సంజన గర్లానీ.

‘హాస్బెండ్ వైఫ్’ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీవాస్తవ నన్ను ఎక్కడెక్కడో తాకాడు. ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టాలని వేధించాడు. నేను అందుకు ఒప్పుకోకపోవడంతో సినిమాలో 50 ముద్దు సీన్లను పెట్టాడు... అప్పుడు నా వయసు 16 ఏళ్లు. అది నా మొదటి సినిమా...
సంజన గర్లానీ, హీరోయిన్


ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన దర్శకుడు.... ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో నటిపై ఫిర్యాదు చేశారు. తన పేరును దెబ్బకొట్టే ఉద్దేశ్యంతోనే నటి సంజన ఈ విధంగా ఆరోపణలు చేసిందని, దీనిపై న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పాడు రవిశ్రీవాస్తవ.
Published by: Ramu Chinthakindhi
First published: October 20, 2018, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading