#MeToo: మీటూ ఉద్య‌మం ప‌క్క‌దారి ప‌డుతుందా...?

ఒక్క‌రిలో కాదు.. అంద‌రిలోనూ ఇప్పుడు ఇదే అనుమానాలు వ‌స్తున్నాయి. కావాల‌నే కొంద‌రు ఉద్య‌మాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తుంది. కేవ‌లం అన్యాయం జ‌రిగిన వాళ్లు మాత్ర‌మే మాట్లాడితే బాగుంటుంద‌ంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2018, 3:33 PM IST
#MeToo: మీటూ ఉద్య‌మం ప‌క్క‌దారి ప‌డుతుందా...?
మీటూ ఉద్యమం
  • Share this:
ఒక్క‌రిలో కాదు.. అంద‌రిలోనూ ఇప్పుడు ఇదే అనుమానాలు వ‌స్తున్నాయి. కావాల‌నే కొంద‌రు ఉద్య‌మాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌నే వాద‌న కూడా వినిపిస్తుంది. కేవ‌లం అన్యాయం జ‌రిగిన వాళ్లు మాత్ర‌మే మాట్లాడితే బాగుంటుంద‌ని.. కానీ ఇదే అదునుగా అంతా దీని గురించే మాట్లాడుతూ కావాల‌నే కొంద‌రు పాపుల‌ర్ అవుతున్నార‌ని చెప్పాడు క‌మ‌ల్ హాస‌న్. ఆయ‌న‌తో పాటు యాంక‌ర్ అన‌సూయ కూడా ఇదే మాట‌లు మాట్లాడింది. ఇప్పుడు మోడ‌ల్ మౌనీరాయ్ సైతం ఇలాంటి వ్యాఖ్య‌లే చేసింది.

#MeToo: మీటూ ఉద్య‌మం ప‌క్క‌దారి ప‌డుతుందా...? #MeToo: metoo movement going in to wrong way.. #MeToo, metoo movement, going, in to, wrong way,subhash ghai,kamal haasan,mouni roy,hindi cinema,మీటూ ఉద్యమం,పక్కదారి పడుతున్న మీటూ ఉద్యమం,శ్రీరెడ్డి,మౌనీ రాయ్,సుభాష్ ఘాయ్,తెలుగు సినిమా,హిందీ సినిమా
కమల్ హాసన్


మీటూ ఉద్య‌మాన్ని కావాల‌నే కొంద‌రు త‌మ స్వ‌లాభం కోసం వాడుకుంటున్నార‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఒక్క‌రో ఇద్ద‌రో అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ అంతా ఇప్పుడు మ‌రో ప‌ని ఏదీ పెట్టుకోకుండా దీనిపైనే ఉండ‌టం అనుమానాలకు తావిస్తుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ గా మ‌రో ఆలోచ‌న కూడా లేకుండా అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు.. లేదులేదు మాట్లాడుకునేలా చేస్తున్నారు. సింహాలో బాల‌య్య చెప్పిన‌ట్లు ఇన్నాళ్లు లేవ‌ని నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి.. ఎప్పుడో ప‌దేళ్ల కింద జ‌రిగిన ఇష్యూను ఇప్పుడు ఎందుకు త‌ను శ్రీ ద‌త్తా ఫోక‌స్ చేసింద‌ని అడుగుతున్నారు.

#MeToo: మీటూ ఉద్య‌మం ప‌క్క‌దారి ప‌డుతుందా...? #MeToo: metoo movement going in to wrong way.. #MeToo, metoo movement, going, in to, wrong way,subhash ghai,kamal haasan,mouni roy,hindi cinema,మీటూ ఉద్యమం,పక్కదారి పడుతున్న మీటూ ఉద్యమం,శ్రీరెడ్డి,మౌనీ రాయ్,సుభాష్ ఘాయ్,తెలుగు సినిమా,హిందీ సినిమా
మీ టూ ఉద్యమం


ఆమెతో పాటు కావాల‌నే ఇప్పుడు కొంద‌రు పెద్ద‌వాళ్ల పేర్లు కూడా తీసుకొస్తున్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయనేది కేవలం వాళ్ల‌కు మాత్ర‌మే తెలియాలి. పైగా ఇప్పుడు ప్ర‌త్యేక క‌మిటీ కూడా వేసింది కేంద్రం. అప్పుడు కోర్ట్ ముందుకు ఇష్యూ వెళ్తే అక్క‌డ కావాల్సింది క‌న్నీళ్లు కాదు సాక్ష్యాలే. మ‌రి అవి ఎక్క‌డ్నుంచి తీసుకొస్తారు..? ఎంత‌మందిని ఇలా కోర్టుకు ఈడుస్తారు..? క‌్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండ‌స్ట్రీలో ఎప్ప‌ట్నుంచో ఉన్న కీచ‌క సంస్కార‌మే. మ‌రి ఇందులో ఎంత‌మంది నిజాలు చెబుతున్నార‌నేది కూడా తెలియాలి క‌దా. మొత్తానికి ఇవ‌న్నీ చూస్తుంటే నిజంగానే కొంద‌రిలో లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: October 14, 2018, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading