#మీటూ ఎఫెక్ట్: శృతి పై అర్జున్ రూ.5 కోట్ల పరువు నష్టం దావా

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ఒకవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటుతున్న యాక్షన్ కింగ్ అర్జున్‌పై నటి శృతి హరిహరణ్ చేసిన ఆరోపణలు ఎన్నో మలుపులు తిరుగుతోంది. తాజాగా అర్జున్‌పై మీటూ ఆరోపణలు చేసిన శృతి హరిహరణ్‌పై  అర్జున్ మేనల్లుడు ప్రముఖ హీరో ధృవ సర్జ ...రూ.5 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశాడు.

news18-telugu
Updated: October 26, 2018, 1:16 PM IST
#మీటూ ఎఫెక్ట్: శృతి పై అర్జున్ రూ.5 కోట్ల పరువు నష్టం దావా
అర్జున్, శృతి హరిహరన్
  • Share this:
దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ఒకవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా, నిర్మాతగా సత్తా చాటుతున్న యాక్షన్ కింగ్ అర్జున్‌పై నటి శృతి హరిహరణ్ చేసిన ఆరోపణలు ఎన్నో మలుపులు తిరుగుతోంది.  ఈ విషయమై ఇండస్ట్రీలో ఖుష్బూ సహా డజను పైగా పలువురు నటీమణులు అర్జున్‌కు మద్దుతుగా మాట్లాడతున్నారు. మరోవైపు అర్జున్ కూడా నా ఫిల్మ్ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్‌లతో పని చేశాను కానీ ఎవరు నాపై ఇలాంటి ఆరోపణలు చేయలేదన్నారు.

ఇక ప్రకాష్ రాజ్ సహా మరికొంత మంది నటీనటులు శృతి హరిహరన్‌కు బాసటగా నిలుస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిన వార్తలు వినిపించాయి. తాజాగా అర్జున్ మీద లేనిపోని ఆరోపణలు చేసిన శృతి తగిన మూల్యం చెల్లుంచు కోవాల్సిందేనని అర్జున అభిమానులు, మద్దతు దారులు అంటున్నారు.

తాజాగా అర్జున్‌పై మీటూ ఆరోపణలు చేసిన శృతి హరిహరణ్‌పై  అర్జున్ మేనల్లుడు ప్రముఖ హీరో ధృవ సర్జ ...రూ.5 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశాడు. మొత్తానికి అర్జున్, శృతి హరిహరన్‌ల వివాదం దక్షిణాదిలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 26, 2018, 10:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading