మీటూ కేసులో నానా ప‌టేక‌ర్‌కు కోర్ట్ క్లీన్ చిట్.. త‌నుశ్రీ ద‌త్తాకు షాక్..

ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 13, 2019, 4:45 PM IST
మీటూ కేసులో నానా ప‌టేక‌ర్‌కు కోర్ట్ క్లీన్ చిట్.. త‌నుశ్రీ ద‌త్తాకు షాక్..
నానా పటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్త
  • Share this:
ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. త‌నతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డ‌మే కాకుండా లైంగిక వేధింపుల‌కు కూడా పాల్పడ్డాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది త‌నుశ్రీ‌. అయితే దీనిపై నానా మాత్రం ఎప్పుడూ అస‌త్య‌మే అని కొట్టి పారేస్తూ వ‌చ్చాడు. బాలీవుడ్ ఒక్క‌టే కాదు.. ఇండియ‌న్ సినిమాను కూడా కుదిపేసిన ఘ‌ట‌న ఇది. నానా ప‌టేక‌ర్‌పై కేస్ కూడా న‌మోదైంది.
#MeToo: Court given clean chit to Nana Patekar in Sexual Harassment Case Filed by Tanushree Dutta because of no proof pk.. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. nana patekar,nana patekar twitter,tanushree dutta twitter,nana patekar clean chit,Nana Patekar Sexual Harassment,Nana Patekar Sexual Harassment tanushree dutta,tanushree dutta nana patekar,nana patekar tanushree dutta,tanushree dutta nana patekar song,tanushree dutta nana patekar controversy,nana patekar controversy,nana patekar press conference,#metoo,metoo,metoo india,nana patekar accused,metoo nana patekar,nana patekar interview,tanushree dutta & nana patekar,tanushree dutta and nana patekar,tanushree dutta nana patekar fight,me too bollywood,me too campaign bollywood,bollywood gossips,#metoo,bollywood me too campaign,#metoo bollywood,me too movement,metoo india bollywood,me too bollywood stories,me too movement bollywood,metoo movement in bollywood,metoo,casting couch,casting couch in bollywood,casting caouh,female casting couch,dirty casting couch scandal,sri reddy about casting couch,saroj khan statement on casting couch,hollywood casting couch satan's playground,hindi cinema,తనుశ్రీ దత్తా,నానా పటేకర్,నానా పటేకర్‌కు క్లీన్ చిట్,సాక్ష్యాలు లేకపోవడంతో నానా పటేకర్‌కు క్లీన్ చిట్,తెలుగు సినిమా,క్యాస్టింగ్ కౌచ్,మీటూ నానా పటేకర్ తనుశ్రీ దత్తా
తనుశ్రీ దత్తా, నానా పాటేకర్

పదేళ్ల క్రితం 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సెట్స్‌లో త‌న‌ను నానా ప‌టేక‌ర్ లైంగికంగా వేధించాడ‌ని తనుశ్రీ దత్తా ఆరోపించింది. ఈమె త‌ర్వాత చాలా మంది ఇలాంటి కామెంట్స్ చేసారు. అయితే ఇప్పుడు నానా పటేకర్‌ తప్పు చేసాడ‌ని చెప్ప‌డానికి ఎలాంటి సాక్ష్యాలు లేవ‌ని కోర్టు తేల్చేసింది. దాంతో ఇన్నాళ్లు కోర్టులో నానిన ఈ కేసు నుంచి ఇప్పుడు విముక్తి పొందాడు నానా. కోర్ట్ ఈయ‌న‌కు క్లీన్ చిట్ ఇచ్చి పంపించింది. అయితే ఇప్ప‌టికీ త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని చెబుతుంది త‌నుశ్రీ‌. ఆమె త‌ర‌ఫు లాయ‌ర్ సుజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సాక్ష్యాలు లేవని ఈ కేసును కోర్ట్ కొట్టేసింది.

#MeToo: Court given clean chit to Nana Patekar in Sexual Harassment Case Filed by Tanushree Dutta because of no proof pk.. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని కుదిపేసిన మీటూ ఉద్య‌మానికి ముందుగా ఆజ్యం పోసిన హీరోయిన్ త‌నుశ్రీ ద‌త్తా. నానా ప‌టేక‌ర్ లాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ మీద లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. nana patekar,nana patekar twitter,tanushree dutta twitter,nana patekar clean chit,Nana Patekar Sexual Harassment,Nana Patekar Sexual Harassment tanushree dutta,tanushree dutta nana patekar,nana patekar tanushree dutta,tanushree dutta nana patekar song,tanushree dutta nana patekar controversy,nana patekar controversy,nana patekar press conference,#metoo,metoo,metoo india,nana patekar accused,metoo nana patekar,nana patekar interview,tanushree dutta & nana patekar,tanushree dutta and nana patekar,tanushree dutta nana patekar fight,me too bollywood,me too campaign bollywood,bollywood gossips,#metoo,bollywood me too campaign,#metoo bollywood,me too movement,metoo india bollywood,me too bollywood stories,me too movement bollywood,metoo movement in bollywood,metoo,casting couch,casting couch in bollywood,casting caouh,female casting couch,dirty casting couch scandal,sri reddy about casting couch,saroj khan statement on casting couch,hollywood casting couch satan's playground,hindi cinema,తనుశ్రీ దత్తా,నానా పటేకర్,నానా పటేకర్‌కు క్లీన్ చిట్,సాక్ష్యాలు లేకపోవడంతో నానా పటేకర్‌కు క్లీన్ చిట్,తెలుగు సినిమా,క్యాస్టింగ్ కౌచ్,మీటూ నానా పటేకర్ తనుశ్రీ దత్తా
తను శ్రీ దత్త, నానా పటేకర్

ఇప్ప‌టికీ తనుశ్రీ ద‌త్తా కావాల‌నుకుంటే ప్రొటెస్ట్‌ రిపోర్ట్‌ను దాఖలు చేయొచ్చ‌ని.. దీనివ‌ల్ల మూసేసిన కేసును కూడా మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిపించే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పాడు. దీనిపై తాను కోర్టును అడుగుతాన‌ని చెబుతున్నాడు త‌నుశ్రీ లాయ‌ర్ సుజాయ్. ఈ తీర్పుపై త‌నుశ్రీ ద‌త్తా కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. కావాల‌నే నానా ప‌టేక‌ర్‌కు భ‌య‌ప‌డి కొంద‌రు సాక్ష్యం చెప్ప‌డానికి వెన‌కాడుతున్నారంటూ ఆమె చెబుతుంది. ఏదేమైనా మీటూ కేసులో త‌నుశ్రీ ద‌త్తాకు మాత్రం ఊహించ‌ని షాక్ త‌గిలింది.
Published by: Praveen Kumar Vadla
First published: June 13, 2019, 4:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading