#MeToo: త్వరలో వైరముత్తుపై కోర్టులో కేసు: చిన్మయి

వైరముత్తు తనను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన 2005-06లలో స్విట్జర్లాండ్‌లో జరిగిందని చిన్మయి చెప్పారు.

news18-telugu
Updated: October 20, 2018, 9:26 PM IST
#MeToo: త్వరలో వైరముత్తుపై కోర్టులో కేసు: చిన్మయి
సినీ గాయకి చిన్మయి
  • Share this:
‘మీ టూ’ ఉద్యమం అటు కోలీవుడ్‌ను కూడా కుదిపేస్తోంది. తమిళ కవి వైరముత్తుపై సినీ గాయని చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తెలిసిందే. ఆరోపణలను తోసిపుచ్చిన వైరముత్తు...ఆరోపణలు చేసే వారు కోర్టును ఆశ్రయించవచ్చని సవాల్ చేశారు. చిన్మయి ఆరోపణల్లో వాస్తవం లేదని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు.

ఈ నేపథ్యంలో చెన్నైలో మీడియాతో మాట్లాడిన చిన్మయి...వైరముత్తుపై త్వరలోనే కేసు పెట్టనున్నట్లు ప్రకటించారు. వైరముత్తు తనను వేధింపులకు గురిచేసిన ఘటన 2005-06లలో స్విట్జర్లాండ్‌లో జరిగిందని చెప్పారు. స్విట్జర్లాండ్‌లో జరిగిన సంగీత కార్యక్రమానికి తాను హాజరుకావడానికి తన పాస్‌పోర్ట్ ప్రధాన సాక్ష్యాధారమన్నారు. అయితే 2006 తర్వాత తాము పలు ఇళ్లకు నివాసాన్ని మార్చామని, పాత పాస్‌పోర్ట్ కనిపించడం లేదన్నారు. పాత పాస్‌పోర్ట్ దొరికిని వెంటనే దాని ఆధారంగా వైరముత్తుపై కేసు పెట్టనున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు.

చిన్మయి, మీ టూ, వైరముత్తు, chinmayi, vairamuthu
చెన్నైలో మీడియాతో మాట్లాడుతున్న చిన్మయి


ఈ ఘటన తర్వాత వైరముత్తు‌ను ఆయన నివాసానికి వెళ్లి తన వివాహపత్రికను ఇచ్చి ఆహ్వానించినట్లు అంగీకరించిన చిన్మయి..అయితే తన వివాహానికి హాజరైన వైరముత్తుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకోలేదని తెలిపారు. పెళ్లికి ముందు ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే మంచి పెళ్లి సంబంధాలు రావన్న కారణంగానే అప్పట్లో తాను వైరముత్తు వేధింపులపై మాట్లాడలేదన్నారు. అయితే ఇప్పుడు తన భర్త తనకు పూర్తి అండగా నిలుస్తున్నారని, అందుకే తనకు జరిగిన చేదు అనుభవాన్ని బహిరంగంగా చెబుతున్నట్లు తెలిపారు.
Published by: Janardhan V
First published: October 20, 2018, 9:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading