#MeToo: ఆ 11 మంది మహిళా ద‌ర్శ‌కుల సంచ‌ల‌న నిర్ణ‌యం..

మీటూ ప్ర‌భావం ఇండియా వ్యాప్తంగా పెరిగిపోతుంది. ఈ ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు మ‌హిళా ద‌ర్శ‌కులు అంతా క‌లిసిక‌ట్టుగా ముందుకెళ్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 14, 2018, 5:27 PM IST
#MeToo: ఆ 11 మంది మహిళా ద‌ర్శ‌కుల సంచ‌ల‌న నిర్ణ‌యం..
లేడీ ఫిల్మ్‌మేకర్స్
  • Share this:
మీటూ ప్ర‌భావం ఇండియా వ్యాప్తంగా పెరిగిపోతుంది. ఈ ఉద్య‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు మ‌హిళా ద‌ర్శ‌కులు అంతా క‌లిసిక‌ట్టుగా ముందుకెళ్తున్నారు. ఇందులో ఇండియ‌న్ టాప్ లేడీ డైరెక్ట‌ర్స్ అంతా ఉన్నారు. ఆడ‌వాళ్ల‌ను వేధించే వాళ్ల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూనే.. అలాంటి వాళ్ల‌ను పూర్తిగా సినిమాల నుంచి బ‌హిష్క‌రించాల‌ని కోరుకుంటున్నారు.

#MeToo: ఆ 11 మంది మహిళా ద‌ర్శ‌కుల సంచ‌ల‌న నిర్ణ‌యం.. #MeToo: 11 Women Filmmakers Take a Stand To Not Work With Proven Offenders.. #MeToo,11 Women Filmmakers Take a Stand To Not Work With Proven Offenders,bollywood, celebrities, list who has accused in me too,#Me Too,nana patekar,abhijeeth bhattacharya,rajath kumar,kailash kher,subhash ghai,sajid khan,Alankrita Shrivastava, Gauri Shinde, Kiran Rao, Konkona Sen Sharma, Meghna Guizar, Nandita Das, Nitya Mehra, Reema Kagti, Ruchi Narain, Shonali Bose,Zoya Akhtar,మీటూ,సాజిద్ ఖాన్,నానా పటేకర్,సుభాష్ ఘాయ్,కైలాష్ ఖేర్,అభిజీత్ భట్టాచార్య,బాలీవుడ్,తను శ్రీ దత్తా,సెక్సువల్ హెరాజ్‌మెంట్,అలంక్రితా శ్రీవాస్త‌వ‌, గౌరీ షిండే, కిర‌ణ్ రావ్, కొంక‌ణా సేన్ శ‌ర్మ‌, మేఘనా గుజ‌ర్, నందితా దాస్, నిత్యా మెహ్రా, రీమా క‌గ్టీ, రుచి న‌రైన్, సోనాలీ బోస్, జోయా అక్త‌ర్
మీటూ ఉద్యమం దర్శకులు


మీటూ ఉద్య‌మానికి త‌మ వంతు కృషిగా అలంక్రితా శ్రీవాస్త‌వ‌, గౌరీ షిండే, కిర‌ణ్ రావ్, కొంక‌ణా సేన్ శ‌ర్మ‌, మేఘనా గుజ‌ర్, నందితా దాస్, నిత్యా మెహ్రా, రీమా క‌గ్టీ, రుచి న‌రైన్, సోనాలీ బోస్, జోయా అక్త‌ర్ క‌లిసి ఓ మీటింగ్ పెట్టారు. అందులో కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇక మీదట అమ్మాయిల‌కు కూడా స‌మాన హ‌క్కు ఇవ్వాల‌ని.. మ‌గ‌వాళ్ల‌తో స‌మానంగా సాంకేతిక విభాగాల్లోనూ ప్రాధాన్య‌త కావాలంటున్నారు. ఇక వాళ్ల‌కు జ‌రిగిన అన్యాయాల‌ను ఇలా ధైర్యంగా బ‌య‌టికి వ‌చ్చి చెప్ప‌డం కూడా ఆనంద‌మే అంటున్నారు వాళ్లు.

మొత్తానికి ఇండియాలో ఓ మార్పు తీసుకొచ్చేంత వ‌ర‌కు కూడా త‌మ ఉద్య‌మం ఆగ‌ద‌ని చెప్పారు వాళ్లు. ఈ ఉద్య‌మం స‌రికొత్త మార్పుకు నాందీ కావాలంటున్నారు. అందులో భాగంగానే అమ్మాయిల‌తో ఆడుకోవాల‌నే వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌కూడ‌ద‌ని తీర్మానించారు. అంతేకాదు.. మీటూ ఎఫెక్ట్ కార‌ణంగా సాజిద్ ఖాన్ "హౌజ్‌ఫుల్ 4" ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి.. సుభాష్ క‌పూర్ "మొఘ‌ల్" సినిమా నుంచి అమీర్ ఖాన్ త‌ప్పుకున్నారు. మొత్తానికి మీటూ ఎఫెక్ట్ ఇప్పుడు సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెడుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 14, 2018, 5:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading