Home /News /movies /

MEME PAGE COMPARE KARTHIKA DEEPAM MOUNITHA TO RAMYA KRISHNAN IN NARASIMHA FILM MNJ

Karthika Deepam- Shobha Shetty: సినిమాలో నీలాంబ‌రి.. సీరియ‌ల్‌లో మౌనిత‌

రమ్యకృష్ణ మౌనిత

రమ్యకృష్ణ మౌనిత

Ramya Krishna- Mounitha: తెలుగు బుల్లితెర‌పై దూసుకుపోతోన్న కార్తీక దీపం సీరియ‌ల్‌లో విల‌న్ మౌనిత‌గా శోభా శెట్టి అద‌ర‌గొట్టేస్తోన్న విష‌యం తెలిసిందే. ఆ పాత్ర ఆమె తప్ప మరెవ‌రు చేయ‌లేరేమో అన్న‌ట్లుగా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సీరియ‌ల్ మొద‌టి నుంచి కార్తీక్‌ని ద‌క్కించుకోవ‌డం ప‌నిగా పెట్టుకున్న మౌనిత‌.. అందుకోసం ఎన్నో దుర్మార్గాలు చేస్తూ ఉంటుంది.

ఇంకా చదవండి ...
    Ramya Krishna- Mounitha: తెలుగు బుల్లితెర‌పై దూసుకుపోతోన్న కార్తీక దీపం సీరియ‌ల్‌లో విల‌న్ మౌనిత‌గా శోభా శెట్టి అద‌ర‌గొట్టేస్తోన్న విష‌యం తెలిసిందే. ఆ పాత్ర ఆమె తప్ప మరెవ‌రు చేయ‌లేరేమో అన్న‌ట్లుగా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సీరియ‌ల్ మొద‌టి నుంచి కార్తీక్‌ని ద‌క్కించుకోవ‌డం ప‌నిగా పెట్టుకున్న మౌనిత‌.. అందుకోసం ఎన్నో దుర్మార్గాలు చేస్తూ ఉంటుంది. కాలేజీలో కార్తీక్ ప్రేమించిన హిమ‌ను చంపించ‌డం మొద‌లు.. కార్తీక్‌కు పిల్ల‌లు పుట్ట‌ర‌ని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించ‌డం.. దీప‌తో పెళ్లైన త‌రువాత ఆమెకు, విహారికి సంబంధం పెట్ట‌డం.. ఇక దీప గ‌ర్భ‌వ‌తి అయిన త‌రువాత ఆమె ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్లేలా చేయ‌డం ఇలా చాలానే చేసింది. ఇక ఇప్పుడు దీప త‌న మీద ప‌డ్డ నింద‌ను చెరిపేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుండగా.. మౌనిత మాత్రం కుట్ర‌ల మీద కుట్ర‌లు చేస్తూ దీప‌పై కార్తీక్‌కి ద్వేషాన్ని పెంచుతూనే ఉంది. ఇక ఇప్ప‌టికీ కార్తీక్‌ని ఎలాగైనా త‌న‌వాడిని చేసుకుంటానంటూ అంద‌రితో శ‌ప‌థం చేస్తూ ఉంటుంది.

    అయితే కార్తీక దీపంలో మౌనిత పాత్ర సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన‌ న‌ర‌సింహ సినిమాలో నీలాంబ‌రిని పోలీ ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఆ సినిమాలో త‌న‌ను కాదు అని త‌న కింద ప‌నిచేసే ప‌నిమ‌నిషి సౌంద‌ర్య‌ను ర‌జ‌నీ పెళ్లి చేసుకోవడం.. పెళ్లి అయిన‌ప్ప‌టికీ అత‌డి కోసం ఎదురుచూస్తూ వ‌య‌సు కూడా పెర‌డ‌గం చూపిస్తారు.

    Karthika Deepam, Karthika Deepam serial, Karthika Deepam Mounitha, Mounitha Shobha Shetty, కార్తీక దీపం, కార్తీక దీపం సీరియల్, కార్తీక దీపం మౌనిత, మౌనిత రమ్యకృష్ణ
    మౌనిత రమ్యకృష్ణచోల


    ఇక ఈ సీరియ‌ల్‌లోనూ మౌనిత అలానే ఉంటుంది. కార్తీక్, దీప‌కు ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టి ప‌దేళ్లు అవుతున్నా.. కార్తీక్‌పై మౌనిత ఇష్టం త‌గ్గ‌దు. ఇప్ప‌టికీ కార్తీక్‌ని త‌న‌వాడిని చేసుకోవ‌డం కోసం ఎదురుచూస్తూనే ఉంది మౌనిత. ఇక ఈ రెండింటిని జ‌త చేస్తూ ఓ మీమ్ పేజ్ కామెంట్ పెట్టారు. నాకు తెలిసి ఈ ప్ర‌పంచంలో ట్రూ ల‌వ‌ర్‌లు ఇద్ద‌రే. సినిమాలో నీలాంబ‌ని, సీరియ‌ల్‌లో మౌనిత అని అందులో కామెంట్ ఉంది. ఇక ఆ మీమ్‌ని మౌనిత అలియాస్ శోభాశెట్టి త‌న సోష‌ల్ మీడియా స్టోరీస్‌లో షేర్ చేయ‌డం విశేషం.
    Published by:Manjula S
    First published:

    Tags: Karthika deepam, Shobha Shetty

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు