సంగీత దర్శకుల్లో ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే అందరిలో డిఫరెంట్ స్టైల్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మెలోడి బ్రహ్మ మణిశర్మ అనే చెప్పాలి. ఎందుకంటే, ఆయన సంగీతం అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఎంతో గొప్పగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఆయన మాత్రం తన సినిమాలకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకలకు అసలు రాడు. అది ఆయనకు సెంటిమెంట్. సాధారణంగా ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేయడానికి ఆయన ఇష్టపడ్డడు. అలాంటి ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు కలిగిన అసౌకర్యాన్ని చెప్పుకున్నాడు. మణిశర్మ పాటలకే కాదు, బ్యాగ్రౌండ్ స్కోర్‌లోనూ స్పెషలిస్ట్ అని చెప్పాలి. అలాంటి మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను కూడా పక్కన పెట్టేశారట. అయితే దానికి మణిశర్మ పేరు వేయడంతో మణిశర్మ ఆ బ్యాగ్రౌండ్ స్కో్ర్ను కాపీ కొట్టేశాడని పేరు వచ్చింది. తనకు అలా పేరు రావడంపై కాస్త ఇబ్బందిగా అనిపించిందని మణిశర్మ చెప్పాడు. ఇంతకీ మణిశర్మకు అలా చెడ్డ పేరు తెచ్చిన సినిమా ఏదో తెలుసా? విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న 'నారప్ప' సినిమా. కొన్ని రోజుల ముందు ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఆ టీజర్లో నారప్ప ఒరిజినల్ అసురన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను తీసుకుని వాడుకున్నారు. వాడుకుంటే వాడుకున్నారు. ఆ టీజర్లో మణిశర్మ పేరు వేయడంతో మణిశర్మ నేపథ్య సంగీతాన్ని కాపీ కొట్టాడంటూ పేరు వచ్చిదంట. అప్పట్లో ఈ విషయం కాంట్రవర్సీ అయ్యింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూల మణిశర్మ ఈ విషయాన్ని చెప్పుకున్నాడు.
ఈ మధ్య పెద్దగా ఊసులో లేని మణిశర్మ.. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆడియో సాధించిన సక్సెస్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టులకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సంక్రాంతికి విడుదలైన రెడ్ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ.. కిట్టిలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్యతో పాటు.. విక్టరీ వెంకటేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న నారప్ప సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నారప్ప'. తమిళ చిత్రం అసురన్‌కు ఇది రీమేక్. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని నిర్మాతలు బావిస్తున్నారు.