MELODY BRAMHA MANI SARMA IM PATIENT ON VENKATESH NAPPA AND WALKOUT FROM MOVIE MHN
Victory Venkatesh - Narappa: విక్టరీ వెంకటేష్‌కు షాకిచ్చిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్రాజెక్ట్ నుంచి వాకౌట్
Melody Bramha Mani Sarma im patient on Venkatesh Nappa and walkout from movie
Victory Venkatesh - Narappa: మెలోడీ బ్రహ్మ మణిశర్మ..సంగీతం అందిస్తోన్న చిత్రాల్లో నారప్ప ఒకటి. ఈ సినిమా నుంచి మెలోడీ బ్రహ్మ వాకౌట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడి బ్రహ్మ మణిశర్మ .. ఓ స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాడా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే.. సమయంలో విక్టరీ వెంకటేష్ సైలెంట్‌గానే ఉన్నట్లు కనిపించినా.. కరోనా లాక్డౌన్ ముగిసిన తర్వాత స్పీడు చూపిస్తున్నాడు. గ్యాప్ తీసుకోకుండా సినిమాలు మీద సినిమాలు చేస్తున్నాడు. లాక్డౌన్ కంటే ముందే స్టార్ట్ చేసిన నారప్ప షూటింగ్‌ను పూర్తి చేయడమే కాకుండా..ఎఫ్3, దశ్యం2 సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాడు. ఈ సినిమాల్లో నారప్ప విషయానికి వస్తే తమిళ సినిమా అసురన్‌కు ఇది రీమేక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మణిశర్మను సంగీత దర్శకుడిగా నిర్ణయించుకున్నారు. అంతా బాగానే ఉంది. ఒకప్పుడు నెంబర్‌వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన మార్క్ క్రియేట్ చేసిన మణిశర్మ స్పీడు మధ్యలో చాలా వరకు తగ్గింది. అయితే ఇస్మార్ట్ శంకర్‌తో పుంజుకుని చిరంజీవితో ఆచార్య, వెంకటేశ్‌తో నారప్ప సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఇదంతా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది.
నారప్ప టీజర్లో తమిళ బీజీఎంను అలాగే వాడుకున్నారు. ఆ సమయంలో మణిశర్మ ట్యూన్ కాపీ కొట్టాడంటూ వార్తలు కూడా వచ్చాయి. దీంతో మణిశర్మ రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనకు కలిగిన అసౌకర్యాన్ని చెప్పుకున్నాడు. మణిశర్మ పాటలకే కాదు, బ్యాగ్రౌండ్ స్కోర్‌లోనూ స్పెషలిస్ట్ అని చెప్పాలి. అలాంటి మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను కూడా పక్కన పెట్టేశారట. అయితే దానికి మణిశర్మ పేరు వేయడంతో మణిశర్మ ఆ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను కాపీ కొట్టేశాడని పేరు రావడం తన బాధను వ్యక్తం చేసుకున్నాడు.
అయితే అప్పటి నుంచి మణిశర్మ అసంతృప్తిగానే ఉన్నాడట. ఈ ట్రావెల్లో ఎక్కడో వ్యవహారం తిరగబెట్టడంతో మణిశర్మ నారప్ప సినిమా నుంచి బయటకు వచ్చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నారప్ప ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమాను మే 14న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసినా నారప్ప విడుదల వెనక్కి వెళ్లే అవకావం ఉందని అంటున్నారు.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.