నేటితరం హీరోయిన్లు చాలా ఓపెన్‌గా ఉంటున్నారు. సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలపై తెగ హంగామా చేస్తున్నారు. ఇది వాళ్లకు వ్యక్తిగత ప్రమోషన్ పరంగా హెల్ప్ కావడమే గాక సదరు స్టార్స్ ఫాలోయింగ్ పెరగడంలో కీలకపాత్ర వహిస్తోంది. హీరోలతో పోల్చితే హీరోయిన్స్ ట్రెండ్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేయడం, తమ తమ రెగ్యులర్ లైఫ్‌కి సంబంధించిన విషయాలు పంచుకోవడం లాంటివి చేస్తూ పాపులారిటీ కూడగట్టుకుంటున్నారు హీరోయిన్లు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరోయిన్ మెహ్రీన్ (Mehreen Pirzada) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బంధువుల పెళ్లికి వెళ్లి అక్కడ తీన్మార్ స్టెప్పులేసింది యంగ్ హీరోయిన్ మెహ్రీన్.
సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ అందాల తారగా పేరు తెచ్చుకుంది మెహ్రీన్ పిర్జాదా. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తూ తెగ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది మెహ్రీన్. తమ దగ్గరి బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొన్న మెహ్రీన్.. నడిరోడ్డుపై బారాత్‌లో డ్యాన్స్ (Mehreen Pirzada Dance) చేసింది. మరో అమ్మాయితో కలిసి తెగ ఉత్సాహంగా చిందులేసింది. ‘పంజాబీ వెడ్డింగ్ సీన్స్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసింది మెహ్రీన్. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.
‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది మెహ్రీన్. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా రవితేజ సరసన ‘రాజా ది గ్రేట్’ సినిమా చేశాక తెలుగులో మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ అయింది. వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు గత కొన్ని రోజుల క్రితం F3 మూవీతో ఆకట్టుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమాలో మెహ్రీన్ అందాలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.
View this post on Instagram
ఇకపోతే తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ భాషా చిత్రాల్లో కూడా నటించి భేష్ అనిపించుకుంది ఈ పంజాబీ బ్యూటీ. నేటితరం యంగ్ హీరోల సరసన బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకుంటున్న ఈ భామ మరిన్ని గ్లామరస్ పాత్రలతో అలరిస్తానని అంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actress Mehreen Pirzada, Mehreen Kaur, Tollywood actress