పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసిన వ్యక్తి తాట తీసిన మెహ్రీన్ కౌర్..

ప్రస్తుతం మెహ్రీన్ కౌర్.. తాజాగా తమిళంలో ధనుష్ హీరోగా  నటించే ఛాన్స్ దక్కించుకుంది. అంతేకాదు 13వ ఏటనే కెనడాలో జరిగిన ‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా’ టైటిల్‌ను గెలుచుకున్న తన చిన్న నాటి విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది.

news18-telugu
Updated: June 20, 2019, 7:04 PM IST
పర్మిషన్ లేకుండా ఫోటోలు తీసిన వ్యక్తి తాట తీసిన మెహ్రీన్ కౌర్..
మెహ్రీన్ కౌర్ అభివాదం (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
వెండితెరపైకి చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు.. వెళ్తుంటారు. కానీ కొంత మంది కొన్నేళ్లపాటు ఆ వెండితెరను ఏలేస్తుంటారు. అలాంటి హీరోయిన్లను ఇప్పటి వరకు చాలా మందినే చూశాం. శ్రియ, త్రిష, కాజల్, ఇలియానా, తమన్నా, హన్సిక ఇలా చాలా మంది తెలుగు తెరపై ఒక మెరుపు మెరిపించారు అలాంటి ఒక తాజా మెరుపే మెహ్రీన్. తన స్కిన్ కలర్‌తో, క్యూట్ యాక్టింగ్‌తో అవకాశాలను ఒడిసిపట్టేస్తోంది హీరోయిన్ మెహ్రీన్. నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తర్వాత ఈ భామ నటించిన సినిమాలు ‘కేరాఫ్ సూర్య’, ‘జవాన్’, ‘పంతం’, ‘నోటా’ సినిమాలూ మెహ్రీన్ని నిరాశ పరిచాయి. అయితే ఈ ఇయర్ సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.  ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ధనుష్ హీరోగా  నటించే ఛాన్స్ దక్కించుకుంది. అంతేకాదు 13వ ఏటనే కెనడాలో జరిగిన ‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా’ టైటిల్‌ను గెలుచుకున్న తన చిన్న నాటి విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది.

Mehreen kaur slaps one unknown person.. who taken Mehreen photos with out permission in mall,mehreen pirzada,mehreen,mehreen kaur,mehreen kaur twitter,mehreen kaur instagram,mehreen kaur facebook,mehreen fans,mehrene kaur pirzada,actress mehreen pirzada,mehreen at hindupur,mehreen angry on fans,mehreen songs,mehreen irritated,mehreen latest updates,mehreen without makeup,mehreen at cmr shopping mall,mehreen latest news,mehreen singing,mehreen and raashi at tirupathi,mehrene angry,mehreen serious on fans,actress mehreen at hindupur,mehrene kaur pirzada songs,tollywood,telugu cinema,మెహ్రీన్ కౌర్,మెహ్రీన్ కౌర్ ట్విట్టర్,మెహ్రీన్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్,మెహ్రీన్ కౌర్ చెంప దెబ్బ,మెహ్రీన్ కౌర్,
మెహ్రీన్ కౌర్


వివరాలలోకి వెళితే ... మెహ్రీన్ పదవ తరగతి చదువుతోన్న సమయంలో ఒక మాల్ కి వెళ్లిందట. ఐతే.. అక్కడ ఓ అబ్బాయి మెహ్రీన్ కి తెలియకుండా.లేకుండా ఫోటోలు తీశాడట. ఈ విషయం తెలిసిన మెహ్రీన్ వెంటనే సెక్యురిటీ వాళ్లకు సమాచారం ఇచ్చింది. అంతేకాదు సదరు ఫోటోలు తీసిన వ్యక్తి దగ్గరకి వెళ్లి మొబైల్ చూపించమని అడిగితే దానికి అతడు అంగీకరించలేదు. దీంతో ఆమె సదరు వ్యక్తిని  ఒక్క లెంపకాయ కొట్టి అతడి షర్ట్ కాలర్ పట్టుకుందట. వెంటనే ఫోన్ తీసుకొని ఫొటోలన్నీ డిలీట్ చేసిందట. ఇక స్కూల్, కాలేజ్ డేస్ లో మెహ్రీన్  అబ్బాయిలతో సమానంగా అల్లరి చేసేదాన్నంటూ చెప్పుకొచ్చిందట. అందువల్ల అబ్బాయిలు కూడా తనతో మాట్లాడాలంటే భయపడేవారని చెప్పుకొచ్చింది  ఈ ముద్దుగుమ్మ. చిన్నప్పటి నుండి హీరోయిన్ కావాలనేదే తన డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు స్కూల్ లో టీచర్ ఒక్కొక్కరినీ వారి గోల్స్ ఏంటో చెప్పమంటే.. తన గోల్ హీరోయిన్ కావడం అంటూ ఠక్కున చెప్పేసానని అంటూ తన చిన్ననాటి సంగతులు చెప్పింది. ఇక హీరోయిన్‌గా  ఇంతవరకు తనకు కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురుకాలేదు అంటూ సమాధాన మిచ్చింది. ఇక ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు అందరూ తనను చాలా బాగా ఆదరించరంటూ చెప్పింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 20, 2019, 7:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading