Home /News /movies /

MEGASTAR STRONG WARNING TO SAI DHARAM TEJ ON HIS BIRTHDAY HERE ARE THE DETAILS TA

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అంటూ..

చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ (File/Photos)

చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ (File/Photos)

Sai Dharam Tej-Chiranjeevi | ఈ రోజు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పుట్టినరోజున చిరంజీవి.. మెగా మేనల్లుడుకి బర్త్ డే విషెస్ తెలియజేయడంతో పాటు ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఇంకా చదవండి ...
    Sai Dharam Tej-Chiranjeevi | ఈ రోజు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా సాయి ధరమ్ తేజ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి.. తన ముద్దుల మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. ‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఉన్నట్టు ఎల్ల కాలం నీవు సోలో బ్రతుకు బతకడం ఇక కష్టమే. త్వరలోనే సోలో బ్రతకు బతుకున్న నీవు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అంటూ.. ఇన్ డైరెక్ట్‌గా సాయి ధరమ్ తేజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.


    మొత్తంగా చిరంజీవి ట్వీట్‌తో సాయి ధరమ్ తేజ్.. తన సోలో బ్రతకుకు త్వరలో గుడ్ బై చెప్పబోతున్నట్టు స్ఫష్టమైంది. సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్‌ ఇందులో సాయికి జోడీగా నటిస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ కావడంతో గుమ్మడికాయ కొట్టేసారు. అంతేకాదు ఈ  చిత్రానికి సంబంధించి సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసాడు. ‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమాతో మరో హిట్టు కొట్టి హాట్రిక్ అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Sai Dharam Tej, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు