హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan - Director Shankar - Rashmika Mandanna: మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. !

Ram Charan - Director Shankar - Rashmika Mandanna: మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. !

శంకర్, రామ్ చరణ్  (Twitter/Photo)

శంకర్, రామ్ చరణ్ (Twitter/Photo)

Ram Charan - Director Shankar - Rashmika Mandanna: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో స్టార్ డైరెక్టర్ రష్మిక మందన్న నటిస్తుందని వార్తలు వినిపించాయి

    మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ మొద‌లు కాకుండా భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. సినిమాపై ఇంత ఎక్స్‌పెక్టేష‌న్స్ రావ‌డానికి కార‌ణ‌మెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎందుకంటే..మెగాప‌వ‌ర్‌స్టార్‌ను డైరెక్ట్ చేయ‌బోయేది సౌతిండియాలో మ‌రో అగ్ర ద‌ర్శ‌కుడిగా పేరున్న శంక‌ర్‌. హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా సినిమాను నిర్మిస్తున్నాడు. శంక‌ర్ చాలా రోజుల క్రిత‌మే తాను ఇండియ‌న్ 2 త‌ర్వాత సైన్స్ ఫిక్ష‌న్ మూవీ చేస్తాన‌ని చెప్పిన వీడియో వైర‌ల్ అవుతోంది. అంటే రామ్‌చ‌ర‌ణ్‌తో ఇప్పుడు శంక‌ర్ చేయ‌బోయేది సైన్స్ ఫిక్ష‌న్ మూవీ అనే అనుకోవాలి.

    ఈ సినిమాలో ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తారు? అనే దానిపై కూడా ప‌లు వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా రామ్‌చ‌ర‌ణ్ జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. శాండివుడ్‌ బ్యూటీ ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీ పుష్పలో బ‌న్ని స‌ర‌స‌న న‌టిస్తుంది. దీని వెంట‌నే రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ సినిమాకు డేట్స్ అడ్జ‌స్ట్ చేస్తాన‌ని చెప్పింద‌ట‌. ఇది క‌నుక జ‌రిగితే ర‌ష్మిక మంద‌న్న స్టార్ హీరోయ‌న్‌గా మ‌రో రేంజ్‌కు చేరుకున్న‌ట్లే.

    director shankar, ram charan, ram charan 15th movie, ram charan and shankar movie, rc15 in dil raju banner, ram charan and shankar movie in svc, rrr, ram charan new movie update, rc15 genre, tollywood latest update, telugu movie news, Rashmika Mandanna, Sandalwood beauty Rashmika mandanna, రామ్‌చరణ్, టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్, ఆర్ఆర్ఆర్, డైరెక్టర్ శంకర్
    Megastar Ram Charan and director Shankar movie heroine fixed

    ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం)’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. మార్చి నెల‌నాటికంతా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌ని జ‌క్క‌న్న అనుకుంటున్నాడ‌ట‌. దీని త‌ర్వాతే శంక‌ర్ సినిమాలో చ‌ర‌ణ్ పార్టిసిపేట్ చేస్తాడు. దిల్‌రాజు, శిరీశ్ క‌లిసి ఈ భారీ బ‌డ్జెట్ మూవీని నిర్మించ‌నున్నారు. దీంతో పాటు రామ్‌చ‌ర‌ణ్ ఓ యంగ్ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

    Published by:Anil
    First published:

    Tags: Ram Charan, Rashmika mandanna, Shankar

    ఉత్తమ కథలు