హోమ్ /వార్తలు /సినిమా /

Jr Ntr: ఆచార్యతో నష్టపోయిన వారికి.. ఆ రకంగా ఎన్టీఆర్ సాయం.. !

Jr Ntr: ఆచార్యతో నష్టపోయిన వారికి.. ఆ రకంగా ఎన్టీఆర్ సాయం.. !

చిరంజీవి ఆచార్య 5 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

చిరంజీవి ఆచార్య 5 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

  మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన ఆచార్య(Acharya) సినిమా కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. మెగా అభిమానులు సైతం ఈ సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో చిత్ర డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వాటిల్లాయి. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ కొరటాల శివ తన వంతు బాధ్యతగా డిస్ట్రిబ్యూటర్లకు ఫైనల్ సెటిల్మెంట్ ఆఫర్ చేశారట. ఫైనల్ సెటిల్మెంట్ లో భాగంగా కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు 33 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

  మరోవైసు ఈ మధ్యనే ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగి హైదరాబాద్ కి వచ్చిన చిరంజీవి కూడా దీని గురించి కొరటాల శివని ఆరాతీశారని సమాచారం. ఫారిన్‌ వెకేషన్‌ నుంచి తిరిగి రాగానే మెగాస్టార్ చిరంజీవి కొరటాలకు ఫోన్‌ చేసి ఈ స్టేటస్‌పై అడిగి తెలుసుకున్నారు. ఆచార్య చిత్రాన్ని నిర్మాత నిరంజన్ రెడ్డి దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో పూర్తి చేశారనేది సినీ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాను రిలీజ్‌కు ముందే 120 కోట్లకు బిజినెస్ చేశారు. అయితే ఈ సినిమా దాదాపు 40 కోట్ల వరకు రాబట్టింది. అయితే డిస్టిబ్యూటర్లకు వాటిల్లిన నష్టాన్ని పూడ్చేందుకు దాదాపు 80 కోట్ల వరకు వెనక్కి ఇచ్చివేసినట్టు సమాచారం.

  మరోవైపు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వారు ఇంకా ఆ చిత్ర నిర్మాతలకు కొంత అమౌంటు ఇవ్వాల్సి ఉంది. ఆ అమౌంట్ కూడా వచ్చాక డిస్ట్రిబ్యూటర్ లకు ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ కూడా డిస్ట్రిబ్యూటర్ లకు 10 కోట్లు తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా జీఎస్టీ తగ్గించినట్లు సమాచారం.

  అయితే కొరటాల శివ మిగతా పెండింగ్ మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లకు అందజేయనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొరటాల శివను తమ సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు ఆచార్యతో నష్టపోయిన వారికి పెండింగ్‌లో ఉన్నది అంతా క్లియర్ చేయాలని చెప్పినట్లు సమాచారం. కొరటాల ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించాడు, షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Aacharya, Acharya movie, Jr ntr

  ఉత్తమ కథలు