మెగాస్టార్ పరువు తీసిన అభిమానులు.. జ్యూరీకి సారీ చెప్పిన హీరో..

అభిమానులు అంటే పరువు నిలబెట్టేలా ఉండాలి కానీ తీసేలా కాదు. కానీ ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇదే చేసారు. అయినా మెగాస్టార్ అంటే చిరంజీవి కాదు.. ఆయన మనకు మెగాస్టార్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 12, 2019, 5:29 PM IST
మెగాస్టార్ పరువు తీసిన అభిమానులు.. జ్యూరీకి సారీ చెప్పిన హీరో..
మమ్ముట్టి ఫైల్ ఫోటో (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 12, 2019, 5:29 PM IST
అభిమానులు అంటే పరువు నిలబెట్టేలా ఉండాలి కానీ తీసేలా కాదు. కానీ ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇదే చేసారు. అయినా మెగాస్టార్ అంటే చిరంజీవి కాదు.. ఆయన మనకు మెగాస్టార్.. అలాగే కేరళలో కూడా ఓ మెగాస్టార్ ఉన్నాడు. అతడే మమ్ముట్టి.. ఈయనను క్షమాపణ చెప్పే స్థాయికి అభిమానులు దిగజార్చేసారు. చివరికి తన తప్పు లేకుండానే ఆయన సారీ కూడా చెప్పాడు. ఇంతకీ రచ్చ ఏంటంటే.. మొన్న ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో మమ్ముట్టికి జాతీయ అవార్డు రాకపోవడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు.
Megastar Mammootty apologises to National Awards jury Chairman Rahul Rawail for fans hate mail pk అభిమానులు అంటే పరువు నిలబెట్టేలా ఉండాలి కానీ తీసేలా కాదు. కానీ ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇదే చేసారు. అయినా మెగాస్టార్ అంటే చిరంజీవి కాదు.. ఆయన మనకు మెగాస్టార్.. Mammootty,Mammootty twitter,Mammootty facebook,Mammootty instagram,Mammootty movies,Mammootty perambu,Mammootty national award,Mammootty apologises national jury,Mammootty jury massage,Mammootty national award jury sorry,Mammootty rahul rawail,telugu cinema,malayalam cinema,మమ్ముట్టి,మమ్ముట్టి సినిమాలు,మమ్ముట్టి నేషనల్ అవార్డ్,మమ్ముట్టి రాహుల్ రవైల్,మలయాళ సినిమా,మమ్ముట్టి నేషనల్ అవార్డ్
మమ్ముట్టి ఫైల్ ఫోటో (Source: Twitter)

మమ్ముట్టి నటించిన పెరంబు సినిమాకు కచ్చితంగా అవార్డ్ రావాల్సింది.. కానీ కావాలనే ఆయన్ని తొక్కేయడానికి ప్రయత్నించారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తమ హీరోకు అన్యాయం జరిగిందని అవార్డుల కమిటీ చైర్మన్‌ రాహుల్‌ రవిపై దండయాత్ర చేస్తున్నారు మమ్ముట్టి అభిమానులు. ఆయన ఫేస్ బుక్ పేజీలో ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కనీసం రాయడానికి వీల్లేని బూతులతో విరుచుకుపడ్డారు. నిజానికి పెరంబు సినిమాకు మంచి అప్లాజ్ వచ్చింది. సినీ ప్రముఖుల నుంచి ప్రసంశలను అందుకోవడమే కాకుండా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ప్రదర్శితమైంది పెరంబు.

Megastar Mammootty apologises to National Awards jury Chairman Rahul Rawail for fans hate mail pk అభిమానులు అంటే పరువు నిలబెట్టేలా ఉండాలి కానీ తీసేలా కాదు. కానీ ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇదే చేసారు. అయినా మెగాస్టార్ అంటే చిరంజీవి కాదు.. ఆయన మనకు మెగాస్టార్.. Mammootty,Mammootty twitter,Mammootty facebook,Mammootty instagram,Mammootty movies,Mammootty perambu,Mammootty national award,Mammootty apologises national jury,Mammootty jury massage,Mammootty national award jury sorry,Mammootty rahul rawail,telugu cinema,malayalam cinema,మమ్ముట్టి,మమ్ముట్టి సినిమాలు,మమ్ముట్టి నేషనల్ అవార్డ్,మమ్ముట్టి రాహుల్ రవైల్,మలయాళ సినిమా,మమ్ముట్టి నేషనల్ అవార్డ్
మమ్ముట్టి ఫైల్ ఫోటో (Source: Twitter)

కమర్షియల్ విజయం కూడా సాధించడంతో కచ్చితంగా ఈ సినిమాకు అవార్డుల పంట పండటం ఖాయం అనుకున్నారంతా. కచ్చితంగా తమ హీరోకు మరో నేషనల్ అవార్డు వస్తుందని ఊహించారు ఫ్యాన్స్. అయితే రాకపోవడంతో పాటు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం ఇప్పుడు మమ్ముట్టి అభిమానులను తీవ్రంగా కలిసివేసింది. దాంతో జాతీయ అవార్డుల కమిటీ చైర్మన్‌ రాహుల్‌రవిపై ఫేస్‌బుక్‌లో విమర్శల దాడికి దిగారు మమ్ముట్టి ఫ్యాన్స్. దీనిపై నేషనల్ అవార్డ్ జ్యూరీ ఛైర్మెన్ రాహుల్ రవి.. నటుడు మమ్ముట్టికి ఓ ట్వీట్ పెట్టాడు.
Megastar Mammootty apologises to National Awards jury Chairman Rahul Rawail for fans hate mail pk అభిమానులు అంటే పరువు నిలబెట్టేలా ఉండాలి కానీ తీసేలా కాదు. కానీ ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం ఇదే చేసారు. అయినా మెగాస్టార్ అంటే చిరంజీవి కాదు.. ఆయన మనకు మెగాస్టార్.. Mammootty,Mammootty twitter,Mammootty facebook,Mammootty instagram,Mammootty movies,Mammootty perambu,Mammootty national award,Mammootty apologises national jury,Mammootty jury massage,Mammootty national award jury sorry,Mammootty rahul rawail,telugu cinema,malayalam cinema,మమ్ముట్టి,మమ్ముట్టి సినిమాలు,మమ్ముట్టి నేషనల్ అవార్డ్,మమ్ముట్టి రాహుల్ రవైల్,మలయాళ సినిమా,మమ్ముట్టి నేషనల్ అవార్డ్
మమ్ముట్టి ఫైల్ ఫోటో (Source: Twitter)



మీ అభిమానులు నన్ను తీవ్రంగా దూషిస్తున్నారు. నా సోషల్ మీడియా పేజీ మొత్తం వీటితోనే నిండిపోయింది.. కావాలంటే చూడండి.. పైగా మీకు ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నాను.. కమిటీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నంచకూడదు.. ఇక మీరు నటించిన పెరుంబు చిత్రాన్ని ప్రాంతీయ కమిటీనే తిరస్కరించడంతో కేంద్ర కమిటీ పరిశీలనకు అసలు రానేలేదు. అలాంటప్పుడు అవార్డులు ఎలా వస్తాయి..? ఈ విషయం తెలియక మీ అభిమానులు నానా గొడవ చేస్తున్నారు అంటూ లేఖ రాసాడు. ఇది చూసిన మమ్ముట్టి వెంటనే సమాధానం ఇచ్చాడు. సర్.. క్షమించండి.. అసలు ఈ విషయాలేమీ నాకు తెలియవు. అయినా కూడా జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి తను చేయని తప్పుకు మెగాస్టార్ స్వయంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...