Home /News /movies /

MEGASTAR GIVEN ANOTHER CHANCE TO TIRSHA AS HEROIN AFTER WALK OUT ACHARYA MOVIE TA

ఆచార్య నుంచి తప్పుకున్నా.. త్రిషకు మరో ఛాన్స్ ఇస్తున్న చిరంజీవి..

 చిరంజీవి, త్రిష (Twitter/Photo)

చిరంజీవి, త్రిష (Twitter/Photo)

ఏ ముహూర్తానా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను మొదలుపెట్టాడో.. ఈ సినిమాకు అడుగుడున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య నుంచి హీరోయిన్‌గా తప్పుకున్న త్రిషకు హీరోయిన్‌గా చిరు మరో ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచరాం.

    ఏ ముహూర్తానా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను మొదలుపెట్టాడో.. ఈ సినిమాకు అడుగుడున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతానిని బ్రేకులు పడ్డాయి. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.అంతే కాకుండా నక్సలైట్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఆచార్య చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సామాజిక కోణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి లుక్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. మరోవైపు ఈ చిత్రంలో చిరు సరసన  ముందుగా హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు. వీళ్లిద్దరిపై ఒకటి రెండు సన్నివేశాలు తెరకెక్కించారు.కానీ  క్రియేటివ్ డిఫరెన్స్‌సెస్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది. త్రిష ప్లేస్‌లో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారు. ఆమె కూడా ఈసినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వచ్చినా.. అవన్నీ రూమర్సే అంటూ కొట్టి పారేసింది కాజల్.

    megastar given another chance to tirsha as  heroin after walk out acharya movie,chiranjeevi,kajal aggarwal,kajal aggarwal twitter,kajal aggarwal instagram,kajal aggarwal confirmed to act chiranjeevi acharya movie,chiranjeevi kajal aggarwal,kajal aggarwal romance to chiranjeevi koratala siva,acharya update, kajal in chiranjeevi film, kajal replaces trisha for Acharaya,regina song in Acharya,రెజీనా, ఆచార్య,రెజీనా సాంగ్, chiranjeevi,chiranjeevi movies,Chiranjeevi,Trisha Khrishnan,Trisha Khrishnan walks out from chiranjeevi movie,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి త్రిష,చిరంజీవి సినిమా నుంచి త్రిష ఔట్,త్రిష చిరంజీవి కొరటాల శివ,త్రిష కృష్ణన్,కాజల్,kajal in Aacharya,kajal in acharya,ఆచార్యలో కాజల్,చిరంజీవి,చిరంజీవి కాజల్ అగర్వాల్,చిరంజీవి ఆచార్యలో నటిస్తున్నట్టు ప్రకటించిన కాజల్ అగర్వాల్
    చిరంజీవి, త్రిష (File/Photos)


    అయితే త్రిష ఎందుకు మెగాస్టార్ సినిమాను వదులుకుందనే విషయం ఎవరికీ అర్థంకాలేదు. అయితే మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కబోయే నయా మూవీ కోసమే త్రిష... మెగాస్టార్ చిరంజీవి సినిమాను వదులుకుందని తెలుస్తోంది. ఆ సినిమాకు ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి రావడంతో... ఇందుకోసం త్రిష మెగాస్టార్‌కు హ్యాండిచ్చినట్టు తెలుస్తోంది. ఇంత చేసినా.. త్రిష విషయంలో మెగాస్టార్ చిరంజీవి కూల్‌గానే ఉన్నారు. ఆమె బర్త్ డే సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పడంతో పాటు చిరు యాక్ట్ చేయబోయే నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా మరో ఆఫర్ ఇవ్వడానికి సిద్ద పడ్డట్టు సమచారం. మొత్తానికి చిరంజీవి తన విషయంలో త్రిష చేసిన పనిని పెద్దగా పట్టించుకోవడమే కాకుండా తన తర్వాత సినిమాలో కథానాయికగా చాన్స్ ఇవ్వడం నిజంగా గ్రేట్.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aacharya, Chiranjeevi, Telugu Cinema, Tollywood, Trisha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు