Syeraa:‘సైరా.. నరసింహారెడ్డి’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్యాకేజ్..

Mega Star Syeraa Narasimha Reddy | ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా మేకింగ్ విజువల్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

news18-telugu
Updated: August 14, 2019, 6:05 PM IST
Syeraa:‘సైరా.. నరసింహారెడ్డి’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్యాకేజ్..
సైరా పోస్టర్ (Source: Facebook)
news18-telugu
Updated: August 14, 2019, 6:05 PM IST
‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలందరినీ రంగంలోకి దిగినట్టు సమాచారం. .200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. దీంతో ఈ సినిమాకు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించింది. మరోవైపు తమన్నా కూడా ఈ సినిమాలో నర్తకి పాత్రలో నటిస్తోంది. తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ట్రైలర్ విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. ఉయ్యాలవాడ క్యారెక్టర్ చనిపోతే.. మరో పాత్ర సస్పెన్స్ అని చెబుతున్నారు.

‘సైరా’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్లానింగ్, Ram Charan, Allu Arjun Will Play Guest Roles in chiranjeevi's Syeraa Narasimha Reddy Movie, Mega Star Syeraa Narasimha Reddy | ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలందరినీ రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడు. Megastar Chiranjeevi Syeraa Narasimha Reddy, Chiranjeevi Syeraa Narasimha Reddy Ram charan, Chiranjevi Syeraa Ram charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy Ram Charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy, చిరంజీవి, చిరు, చిరంజీవి సైరా నరసింహారెడ్డి, చిరు సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్, చిరంజీవి సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి రామ్ చరణ్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్,
సైరా పోస్టర్


మరోవైపు వైపు జగపతిబాబు, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మెగా డాటర్ నిహారిక ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి..సినిమా ఫస్టాఫ్‌లో ఒక చిన్నపాత్రలో నటిస్తోందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ సినిమాలో మెగా హీరో వారసులైన రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు గెస్ట్‌గా అతిథి పాత్రల్లో మెరవనున్నుట్టు సమాచారం.

‘సైరా’ కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ప్లానింగ్, Ram Charan, Allu Arjun Will Play Guest Roles in chiranjeevi's Syeraa Narasimha Reddy Movie, Mega Star Syeraa Narasimha Reddy | ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ హీరోలందరినీ రంగంలోకి దింపాలని డిసైడ్ అయ్యాడు. Megastar Chiranjeevi Syeraa Narasimha Reddy, Chiranjeevi Syeraa Narasimha Reddy Ram charan, Chiranjevi Syeraa Ram charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy Ram Charan Allu Arjun Guest Roles, Syeraa Narasimha Reddy, చిరంజీవి, చిరు, చిరంజీవి సైరా నరసింహారెడ్డి, చిరు సైరా నరసింహారెడ్డి రామ్ చరణ్, చిరంజీవి సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి రామ్ చరణ్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్,
రామ్ చరణ్ అల్లు అర్జున్




అంతేకాదు ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు సమాచారం. ఈ రకంగా ‘సైరా’ కోసం మెగా హీరోలందరు తలో చేయి వేయనున్నట్టు సమాచారం. గతంలో చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’లో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలందరు అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే కదా. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇపుడు చేస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు వరకైన ‘బాహుబలి’ రికార్డులను తిరగరాయాలని మెగా ఫ్యామిలీ ఆలోచన చేస్తోంది. మరి మెగా ఫ్యామిలీ హీరోలందరితో కలిసి మెగాస్టార్ చేస్తోన్న ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
First published: August 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...