• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGASTAR CHIRANJEEVI WITH HIS TEAM TO MEET AP CM YS JAGAN VERY SOON TO DISCUSS ABOUT TICKET RATES ISSUE PK

Chiranjeevi to meet YS Jagan: వైఎస్ జగన్‌తో చిరంజీవి టీం భేటీ.. టికెట్ రేట్స్‌పై చర్చించబోతున్నారా..?

Chiranjeevi to meet YS Jagan: వైఎస్ జగన్‌తో చిరంజీవి టీం భేటీ.. టికెట్ రేట్స్‌పై చర్చించబోతున్నారా..?

చిరంజీవి,సీఎం వైయస్ జగన్ (File/Photo)

Chiranjeevi to meet YS Jagan: వకీల్ సాబ్(Vakeel Saab) విడుదలైన తర్వాత నార్మల్ టికెట్ రేట్స్‌కు అమ్మాలంటూ ప్రభుత్వం రాత్రికి రాత్రే కొత్త జీవో తీసుకొచ్చింది. దానివల్ల సగానికి పైగా టికెట్ రేట్స్ తగ్గిపోయాయి. వకీల్ సాబ్ సినిమా వరకే ఇది ఉంటుందా.. ఫ్యూచర్ కూడా ఇలాగే ఉండబోతుందా అనేది అర్థం కావడం లేదు.

  • Share this:
వకీల్ సాబ్ సినిమా విడుదలైన తర్వాత ఏపీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా టికెట్ రేట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీలో నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా థియేటర్ యజమానులు అయితే ఇలా అయితే తమ థియేటర్స్ మూసుకుని కళ్యాణ మంటపాలు చేసుకుంటాం అంటున్నారు. వకీల్ సాబ్ విడుదలైన తర్వాత నార్మల్ టికెట్ రేట్స్‌కు అమ్మాలంటూ ప్రభుత్వం రాత్రికి రాత్రే కొత్త జీవో తీసుకొచ్చింది. దానివల్ల సగానికి పైగా టికెట్ రేట్స్ తగ్గిపోయాయి. వకీల్ సాబ్ సినిమా వరకే ఇది ఉంటుందా.. ఫ్యూచర్ సినిమాలకు కూడా ఇదే ఉండబోతుందా అనేది చాలా మందిలో వస్తున్న అనుమానం. అయితే ఇకపై రాబోయే సినిమాలకు కూడా ఇలాగే ఉండాలి.. సాధారణ టికెట్ రేట్స్ కంటే ఎక్కువగా అమ్మితే మాత్రం కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆదేశించింది. అయితే ఇదంతా పవన్ కళ్యాణ్‌ను ఇబ్బంది పెట్టడానికే ఉన్నట్లుండి అధికార యంత్రాంతం, మంత్రులు టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చారన్నది అందరికి తెలిసిన రహస్యమే.

వకీల్ సాబ్ వరకు మాత్రమే ఇబ్బందులు పెట్టి.. తర్వాత రాబోయే సినిమాలకు ఇవన్నీ ఎత్తేస్తే మాత్రం కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏకి పారేస్తారు. అలా కాదని మొండిగా ఇదే పద్దతులు ఫాలో అయితే రాబోయే పేరున్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు.

vakeel saab ticket rates in AP,chiranjeevi,chiranjeevi meets ys jagan,chiranjeevi meeting with jagan,chiranjeevi meets cm ys jagan,ys jagan chiranjeevi,chiranjeevi meeting with ys jagan,megastar chiranjeevi,nagarjuna meeting with ys jagan,ys jagan meets chiranjeevi,chiranjeevi and jagan meeting about ticket rates,టికెట్ రేట్స్‌పై జగన్‌ను కలవబోతున్న చిరంజీవి,చిరంజీవి వైఎస్ జగన్ భేటీ
సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ (Chiranjeevi YS Jagan)


ముఖ్యంగా ఆచార్య, అఖండ, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలు చాలానే లైన్‌లో ఉన్నాయి. వీటి ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం టాలీవుడ్ పెద్దలలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ తరఫున ఒక బృందం తమ కోరికల చిట్టా పట్టుకుని త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దాసరి తర్వాత ఇండస్ట్రీకి పెద్దగా మారిన చిరంజీవి ఈ బృందానికి కెప్టెన్ అంటున్నారు.

vakeel saab ticket rates in AP,chiranjeevi,chiranjeevi meets ys jagan,chiranjeevi meeting with jagan,chiranjeevi meets cm ys jagan,ys jagan chiranjeevi,chiranjeevi meeting with ys jagan,megastar chiranjeevi,nagarjuna meeting with ys jagan,ys jagan meets chiranjeevi,chiranjeevi and jagan meeting about ticket rates,టికెట్ రేట్స్‌పై జగన్‌ను కలవబోతున్న చిరంజీవి,చిరంజీవి వైఎస్ జగన్ భేటీ
కేసీఆర్, చిరంజీవి, జగన్(YS Jagan Chiranjeevi)


ఆయనే లీడ్ తీసుకుని జగన్‌కు టికెట్ రేట్స్ గురించి వివరించి ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇండస్ట్రీకి ఎప్పుడు సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ తెలంగాణ అయినా.. అక్కడ ఏపీ అయినా చిరు ముందుంటున్నాడు. అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాడు. ఇప్పుడు టికెట్స్ రేట్స్ విషయంలో ఏపీ సర్కారు వైఖరి ఇండస్ట్రీ పెద్దలకు అర్థం కావడం లేదు.

vakeel saab ticket rates in AP,chiranjeevi,chiranjeevi meets ys jagan,chiranjeevi meeting with jagan,chiranjeevi meets cm ys jagan,ys jagan chiranjeevi,chiranjeevi meeting with ys jagan,megastar chiranjeevi,nagarjuna meeting with ys jagan,ys jagan meets chiranjeevi,chiranjeevi and jagan meeting about ticket rates,టికెట్ రేట్స్‌పై జగన్‌ను కలవబోతున్న చిరంజీవి,చిరంజీవి వైఎస్ జగన్ భేటీ
చిరంజీవి, నాగార్జున‌ (Twitter/Photo)


అందుకే కాస్త టైమ్ తీసుకుని ఆయన్ని కలవాలని చూస్తున్నారు. ఏం చేసినా కూడా త్వరగానే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అమలు చేస్తున్న టికెట్ల రేట్లతో మనుగడ సాధించడం చాలా కష్టం. అవే ధరలు కొనసాగితే తమ సినిమాల బిజినెస్‌ లెక్కలే పూర్తిగా మారిపోతాయి. డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల నుంచి ఆందోళన తప్పకపోవచ్చు. అందుకే వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు