MEGASTAR CHIRANJEEVI WISHES KAIKALA SATYANARAYANA WHO IS RECOVERING IN ICU WARD IN HYDERABAD APOLO HOSPITAL MKS
Kaikala Satyanarayana: గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
కైకాలపై చిరు గుడ్ న్యూస్
Kaikala Satyanarayana: నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి శుభవార్త తెలియజేశారు. తీవ్ర అస్వస్థతకు గురై, జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కైకల స్పృహలోకి రాగానే వైద్యుల సాయంతో ఫోన్లో పరామర్శించానని చిరంజీవి చెప్పారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయారని..
Kaikala Satyanarayana: నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి శుభవార్త తెలియజేశారు. తీవ్ర అస్వస్థతకు గురై, జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కైకాలకు అవయవాలు పనిచేయడంలేదని, చికిత్సకు ఏమాత్రం స్పందన లేదని డాక్టర్లు చెప్పడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఆదివారం మధ్యాహ్నం వరకు పెద్దాయన కొద్దిగా కోలుకున్నారని, స్పృహలోకి కూడా వచ్చారని, స్వయంగా ఫోన్ చేసి మాట్లాడానని చిరంజీవి వెల్లడించడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ మేరకు మెగాస్టార్ కీలక ప్రకటన చేశారు.
చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న కైకల.. శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూ వార్డులో వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నది. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని, కోవిడ్ తర్వాత ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతున్నా ఆశించిన మేరకు స్పందించడం లేదంటూ అపోలో డాక్టర్లు శనివారం రాత్రి ఒక ప్రకటన చేశారు. అయితే ఆదివారం నాటికి కైకాల పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది..
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. కైకల స్పృహలోకి రాగానే వైద్యుల సాయంతో ఫోన్లో పరామర్శించానని చిరంజీవి చెప్పారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయారని, చికిత్స అందిస్తున్న వైద్యుల సాయంతో పలకరించానని, కైకాల నవ్వుతూ తనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైద్యులు చెప్పారని చిరంజీవి వెల్లడించారు.
కైకాల సత్యనారాయణ పూర్తిగా కోలుకుంటారని తనకు నమ్మకం కలిగిందని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నానని చిరంజీవి ఆదివారం నాడు ట్వీట్ చేశారు. ‘ఐసీయూలో చికిత్స పొందుతోన్న కైకాల గారు స్పృహలోకి వచ్చారని తెలియగానే ఆయనకు చికిత్స అందిస్తోన్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఫోన్లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారనే నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, మళ్లీ త్వరగా ఇంటికి రావాలని, ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు.. ఆయన చేతి బొటనవేలు పైకెత్తి డన్ అన్నట్లుగా చూపించారని డాక్టర్లు చెప్పారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది’అని చిరంజీవి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.