Chiranjeevi - Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఓ నిప్పు కణం.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..

పవన్ కళ్యాణ్ చిరంజీవి (Pawan Kalyan Chiranjeevi)

Chiranjeevi - Pawan Kalyan: సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ (Chiranjeevi - Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్‌లో కూడా ఆయనకు ఎంతో మంది సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.

  • Share this:
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్‌లో కూడా ఆయనకు ఎంతో మంది సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. మెగా కుటుంబం నుంచి చాలా మంది హీరోలు ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్‌కి తమదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన ముద్దుల తమ్ముడికి అచ్చమైన తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి రాసిన మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన తమ్ముడిని ఒక నిప్పు కణంతో పోల్చారు చిరంజీవి. చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన.. ప్రతి అడుగు పదిమందికి మేలు జరగాలని ప్రతిక్షణం పరితపించే నిప్పు కణం కళ్యాణ్.. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోడబుట్టిన ఆశయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు చిరంజీవి.

ఈ మధ్య చిరంజీవి పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్‌ ఆయన ఇంటికి వెళ్లి విష్ చేశాడు. అప్పుడు తమ్ముడిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు చిరంజీవి. ఈ ఫోటోలు.. ఆ పోస్టు రెండూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మెగా అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎంతగా ఉందో ఈ ఫోటోలను చూస్తే అర్థం అయిపోతుంది. కొన్నేళ్ల కింద రాజకీయంగా చిరంజీవితో విభేదించిన కూడా వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ ఆయనను దేవుడులానే కొలుస్తారు పవన్ కళ్యాణ్. తనకు జీవితం ఇచ్చింది అన్నయ్యే అని గర్వంగా చెప్పుకుంటాడు. చిన్నప్పటి నుంచి కూడా చిరు చేసిన ప్రతీ పని గుర్తు చేసుకుని మరీ చెప్తుంటాడు పవర్ స్టార్.


తనకు అన్నయ్యతో ఉన్న అనుబంధం గురించి ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు పవన్. ఆయన సాక్సుల వాసన తనకు పూల వాసనలా అనిపించేది అంటే అప్పట్లో సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల వేడుకలో పవన్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఇలా సమయం వచ్చిన ప్రతిసారి అన్నదమ్ముల మధ్య బాండింగ్ బయట పడుతూనే ఉంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవితో పవన్ కళ్యాణ్‌కు విభేదాలు వచ్చాయంటూ చాలా రోజులు వార్తలు బాగానే వచ్చాయి. అప్పుడు చిరును పెద్దగా కలిసేవాడు కూడా పవన్ కళ్యాణ్. దాంతో అది నిజమే అనుకున్నారంతా. కానీ అలాంటిది జన్మలో జరగదని క్లారిటీ ఇచ్చాడు పవర్ స్టార్.
Published by:Praveen Kumar Vadla
First published: