Chiranjeevi - Sukumar : చాలా యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి మళ్లీ యాడ్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ కోవలో శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ యాడ్ చేసారు. తెలుగు కొత్త సంవత్సరాది రోజున ఈ యాడ్‌ను విడుదల చేశారు. ఈ యాడ్‌లో చిరంజీవి సీనియర్ హీరోయిన్ కుష్బూతో పాటు అనసూయతో నటించడం విశేషం. ఈ యాడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ యాడ్ కోసం చిరంజీవి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యాడ్ కోసం చిరంజీవి దాదాపు రూ. 7 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి తన ఓన్ బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌లో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఈ కోవలో ఒక్కో సినిమా కోసం రూ. 20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. ఈ కోవలో ఈ యాడ్ కోసం రూ. 7 కోట్ల వరకు చార్జ్ చేసినట్టు సమాచారం.
మొత్తంగా చిరంజీవి వంటి సీనియర్ హీరో ఈ యాడ్ చేయడంతో శుభగృహ రియల్ ఎస్టేట్‌కు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. ఈ యాడ్‌ను సుకుమార్ డైరెక్ట్ చేసారు. గతంలో చిరంజీవి.. కృష్ణవంశీ దర్శకత్వంలో థమ్స్ అప్‌తో పాటు నవరత్న ఆయిల్‌కు పదమూడేళ్ల క్రితం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా.
RRR : ఆర్ఆర్ఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ లుంగీ డాన్స్..
ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా షూటింగ్ కంప్లీటైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తొలిసారి పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
దాంతో పాటు దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన లూసిఫర్ (Lucifer) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God Father) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. దీంతో పాటు చిరంజీవి .. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు బాబీ సినిమా చేస్తున్నారు. ఇంకోవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.