Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి సరసన స్టార్ హీరో కూతురు.. ఇంతకీ ఏ సినిమాలో అంటే..

చిరంజీవి (Chiranjeevi)

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి సరసన స్టార్ హీరో కూతురు రొమాన్స్ చేయనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

  • Share this:
    Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి సరసన స్టార్ హీరో కూతురు రొమాన్స్ చేయనుందా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం చిరు ..కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ పాటి ఈ సినిమా విడుదలై ఉండేది. దాంతో పాటు ఇంకో సినిమా షూటింగ్ పూర్తి చేసేవారు. ఇక ‘ఆచార్య’ సినిమా విషయానికొస్తే.. ఈ  నెలాఖరుతో ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టనున్నారు. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చిరు లేకుండా మొదలైంది. మరోవైపు మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా సూపర్ హిట్టైన ‘లూసీఫర్’ రీమేక్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

    మరోవైపు మెగాస్టార్ చిరంజీవి.. బాబీ (కేయస్ రవీంద్ర) దర్శకత్వంలో మరో  సినిమాకు ఓకే చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేదాళం రీమేక్‌ కంటే ముందుగానే బాబి సినిమా ట్రాక్‌ ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు తగినట్లుగా డైరెక్టర్‌ బాబి, మైత్రీ మూవీస్ ప్రీ ప్రొడక్షన్‌ పనులను స్టార్ట్‌ చేశాయట. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాక్షి సిన్హా నటించనున్నట్టు సమాచారం.

    Megastar Chiranjeevi Will Romance With Sonakshi Sinha In Bobby K S Ravindra Movie Here Are The Details  Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి సరసన స్టార్ హీరో కూతురు.. ఇంతకీ ఏ సినిమాలో అంటే..,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Romance With Sonakshi Sinha,Sonakshi Sinha,Chiranjeevi Twitter,Chiranjeevi Instagram,Chiranjeevi Facebook,Tollywood,Telugu Cinema,Chiranjeevi Bobby Sonakshi Sinha,Chiranjeevi With Sonakshi Sinha With Booby KS Ravindra Movie,,Mythri Movie Makers,చిరంజీవి,సోనాక్షి సిన్హా,చిరంజీవికి జోడిగా సోనాక్షి సిన్హా,చిరంజీవి సోనాక్షి సిన్హా,కే.యస్.రవీంద్ర బాబీ,కేయస్ రవీంద్ర మూవీలో చిరంజీవి సరసన సోనాక్షి సిన్హా
    చిరంజీవి, సోనాక్షి సిన్హా Photo : Twitter


    ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెగ ఆలోచ‌న‌ల్లో ఉన్నార‌ట‌. ఇప్ప‌టికే ర‌కుల్ ప్రీత్ సింగ్‌, శ్రుతిహాస‌న్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి కూడా. కాగా.. ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా ఈ లిస్టులో చేరింది. ఆమె ఎవ‌రో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ద‌ర్శ‌కుడు బాబీ.. సోనాక్షితో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి సోనాక్షి సిన్హా ఒకే చెప్పిందట. ప్రస్తుతం సోనాక్షి చేతిలో సరైన సినిమాలు లేవు. దీంతో చిరంజీవి సినిమాలో అవకాశం రావడంతో ఓకే చెప్పినట్టు సమాచారం.   ర‌జినీకాంత్‌ ‘లింగ’  త‌ర్వాత, ఆమె న‌టించే రెండో ద‌క్షిణాది చిత్ర‌మిదే అవుతుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: