Chiranjeevi: అభిమానులకు చిరంజీవి సర్ఫ్రైజ్ గిఫ్ట్.. తొలిసారి వెబ్ సిరీస్‌లో మెగాస్టార్..

చిరంజీవి Photo : Twitter

Chiranjeevi  Web Series | అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇవ్వనున్నారు. త్వరలో ఈయన ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నాడు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Chiranjeevi  Web Series | అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి సర్‌ఫ్రైజ్ గిప్ట్ ఇవ్వనున్నారు. త్వరలో ఈయన ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు హీరోలు  ఛేంజ్ అవుతున్నారు. కాలానుగుణంగా తమను తాము అప్‌డేట్ చేసుకుంటున్నారు. అందులో సీనియర్ హీరో చిరంజీవి సినిమాలకు సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో అప్‌డేట్‌గా ఉంటారు.  ప్రస్తుతం సినిమాలకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్,హాట్ స్టార్, జీ 5 వంటి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో గట్టి పోటీ ఏర్పడింది. దీంతో హీరోలు కూడా సినిమాలతో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో తమ లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటున్నారు.  ఇప్పటికే స్మాల్ స్క్రీన్ పై చిరంజీవి, నాగార్జున స్టార్ మా చానెల్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోలో పార్టిసిపేట్ సంగతి తెలిసిందే కదా. ఇక నాగార్జున ఒక అడుగు ముందుకేసీ ‘బిగ్‌బాస్’ వంటి రియాల్టీ షోకు రెండోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే..  తాజాగా మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అది కూడా తన కూతురు సుస్మిత, ఆమె భర్త విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో ఈయన కెమియో రోల్ చేసినట్టు సమాచారం. దానికి సంబంధించిన షూటింగ్ కూడా చిరంజీవి పూర్తి చేసినట్టు సమాచారం.

    చిరంజీవి పెద్ద కూతురు అల్లుడు సుస్మిత, విష్ణు ప్రసాద్.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థను స్థాపించి వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘షూటౌట్ అట్ ఆలేరు’ వెబ్ సిరీస్‌లో చిరంజీవి నటంచినట్టు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌కు క్రేజ్ తీసుకురావడానికి కూతురు సుస్మిత మాట కాదనలేక  మెగాస్టార్ ఇందులో కెమియో రోల్ చేసినట్టు సమాచారం.

    Sushmita Konidela, Sushmita Konidela series, Sushmita Konidela Shootout At Alair web series , Shootout At Alair web series ,tollywood news, chiranjeevi daughter,షూటౌట్ ఎట్ ఆలేరు, సుష్మిత కొణిదెల
    సుష్మిత వెబ్ సిరీస్‌లో చిరంజీవి గెస్ట్ రోల్ Photo : Twitter


    ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రోమోకు మంచి రెస్పాన్స్‌తో పాటు వివాదాల్లో చిక్కుకుంది. ఇక వెబ్ సిరీస్‌లో కీలక పాత్రల్లో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇతర కీలకపాత్రల్లో శ్రీకాంత్, నందిని రాయ్, నిహారిక కనిపించనున్నారు. ఈ వెబ్ సీరిస్‌కు ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ త్వరలో జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: