Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI WILL MEET AP GOVERNMENT OFFICIALS FOR PAWAN KALYAN ISSUE TA

Chiranjeevi : రేపు ఏపీ ప్రభుత్వ పెద్దలతో మెగాస్టార్ చిరంజీవి భేటి.. ? పవన్ కళ్యాణ్ ఇష్యూ నేపథ్యంలో..

పవన్ కల్యాణ్, చిరంజీవి (ఫైల్)

పవన్ కల్యాణ్, చిరంజీవి (ఫైల్)

Chiranjeevi : రేపు ఏపీ ప్రభుత్వ పెద్దలతో మెగాస్టార్ చిరంజీవి భేటి.. ? పవన్ కళ్యాణ్ ఇష్యూ నేపథ్యంలో.. మొత్తంగా రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి.

    Chiranjeevi : రేపు ఏపీ ప్రభుత్వ పెద్దలతో మెగాస్టార్ చిరంజీవి భేటి కానున్నారా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలతో పాటు ఏపీ ప్రభుత్వ వర్గాలు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా వేదికగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ  పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టించాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాని వంటి ఒకరిద్దరు హీరోలు తప్ప ఎవరు పెద్దగా స్పందించలేదు. ఏపీ ప్రభుత్వంతో ఎందుకొచ్చిన చిక్కులు అంటూ కిమ్మనకుండా ఉంటున్నారు. ఈ సందర్భంగా పనవ్ కళ్యాణ్.. నిన్న మంగళగిరి జరిగిన జనసేన సమావేశంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేసారు.

    దీనికి ఏపీ ప్రభుత్వంలోని మంత్రలు .. ఇతర ముఖ్యులు అదే స్థాయిలో స్పందించారు. మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా పవన్ కళ్యాణ్‌ పై అదే స్థాయిలో ధ్వజ మెత్తారు. దీంతో పోసానిపై హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులు భౌతిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఆయన ఇంటిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాళ్ల దాడికి పాల్పడ్డారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ నిర్మాతలైన దిల్ రాజు, డీవీవీ దానయ్య వంటి ప్రముఖులు స్పందించారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీని బతికించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనలను పాటిస్తామన్నారు.

    Puri Jagannadh Introduced Heroines: రేణు దేశాయ్, అనుష్క, అసిన్ సహా పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌కు పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే..

    పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఇండస్ట్రీకి సంబంధం లేదని ఏపీ మంత్రి పేర్ని నానికి వివరణ ఇచ్చారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరోవైపు నాగార్జున కూడా ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ మీట్‌లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రుల పనితీరును మెచ్చుకున్న సంగతి తెలిసిందే కదా.

    Super Star Krishna : అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఈ సూపర్ హిట్ సీక్వెల్ మూవీ తెలుసా..

    అది చాలదన్నట్టు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి .. రేపు రాజమహేంద్ర వరం వెళ్లనున్నారు. అక్కడ దివంగత పద్మశ్రీ అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన పేరిట ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య హోమియో కళాశాల ప్రధాన ద్వారం దగ్గర ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి.. ఏపీ ప్రభుత్వంతో పాటు పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై స్పందిస్తారా అనేది చూడాలి. మరోవైపు చిరంజీవి పనిలో పనిగా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలుసుకుని వివరణ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

    NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

    ఇక ఏపీ మంత్రి పేర్ని నాని కూడా చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దు అంటూ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే కదా. మరి దీనిపై చిరంజీవి క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి. మొత్తంగా పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వంతో రాయబారానికే చిరంజీవి వెళుతున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Pawan kalyan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు