ఏపీ ముఖ్యమంత్రి జగన్‌‌‌తో చిరంజీవి భేటి ఖరారు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటి కానున్నారా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు.

news18-telugu
Updated: October 10, 2019, 2:19 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌‌‌తో చిరంజీవి భేటి ఖరారు..
మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్(ఫైల్ ఫోటోలు)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటి కానున్నారా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ పెద్దలు ఎవరు జగన్మోహన్ రెడ్డిని కలిసింది లేదు. దీనిపై వైసీపీ నేత 30 ఇయర్స్ ఫేమ్ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా. అప్పట్లో దిల్ రాజు, అశ్వినీదత్ వంటి నిర్మాతలు జగన్‌ను కలిసేందకు ప్రయత్నించినా.. అపాయింమెంట్ ఇవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. తాజాగా చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. తాజాగా ఏపీ సీఎం కార్యాలయం చిరంజీవి అపాయింట్‌మెంట్ ఖరారు చేసారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి, రామ్ చరణ్ కలవనున్నారు.  ఇప్పటికే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి. ఆ సినిమాను చూసిన తెలంగాణ గవర్నర్ ఈ సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో చిరంజీవి భేటి (Whatsup/Photo)
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో చిరంజీవి భేటి (Whatsup/Photo)


తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి, రామ్ చరణ్‌లు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు సైరా నరసింహారెడ్డి సినిమాను చూడాలని కోరనున్నారు చిరంజీవి, రామ్ చరణ్. ఈ సినిమాకు ఏపీలో ప్రత్యేక షోలు వేసేందకు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి.. జగన్‌ను కలిసింది లేదు. ఈ సందర్భంగా  ఏపీ సీఎంగా జగన్ ఎన్నికైనందకు ఆయన్ని కలిసి   చిరంజీవి, రామ్ చరణ్ అభినందనలు తెలపనున్నారు.  మరి చిరంజీవి కోరికను మన్నించి జగన్.. ‘సైరా’ సినిమాను చూస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 10, 2019, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading