చిరంజీవి మరో సంచలన నిర్ణయం.. అక్షయ్ తర్వాత ఆ పనిచేస్తోన్న అగ్ర హీరోగా రికార్డు..

చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌న‌లో కొత్త జోష్ వ‌చ్చింది. తాజాగా చిరంజీవి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: May 7, 2020, 2:03 PM IST
చిరంజీవి మరో సంచలన నిర్ణయం.. అక్షయ్ తర్వాత ఆ పనిచేస్తోన్న అగ్ర హీరోగా రికార్డు..
చిరంజీవి,అక్షయ్ కుమార్ (File/Photos)
  • Share this:
చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌న‌లో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు. ఇప్పుడు వ‌ర‌స చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని రకాల షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో హిట్టైన లూసీఫర్ సినిమాను సుజిత్ దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్నాడు. ఆ తర్వాత మెహర్ రమేష్‌తో పాటు హరీష్ శంకర్‌లతో సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు. తాజాగా చిరంజీవి వెబ్ సిరీస్‌లో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్‌లో చాలా మంది నటీనటులు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నటిస్తున్నారు. అయితే బిగ్ స్టార్స్ మాత్రం ఎవరు దీనిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్డం లేదు. ఇప్పటికే బాలీవుడ్‌లో అగ్ర నటుడు  అక్షయ్ కుమార్.. అమెజాన్ ప్రైమ్‌లో నటించడానికి అగ్రిమెంట్ చేసాడు. ఇందులో నటించడానికి ఖిలాడీకి పెద్ద మొత్తంలోనే ముట్టజెప్పినట్టు సమాచారం. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి కూడా వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

megastar chiranjeevi will be act in web series speculation going on tollywood,Megastar chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi may act web series,chiranjeevi akshay kumar,web series chiranjeevi,chiranjeevi acharya,chiranjeevi ram charan koratala siva,chiranjeevi allu aravind aha web series,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి వెబ్ సిరీస్,వెబ్ సిరీస్‌లో చిరంజీవి,చిరంజీవి సినిమాలు,చిరంజీవి కొరటాల శివ ఆచార్య,చిరంజీవి ఆహా అల్లు అరవింద్,ఆహా ఓటీటీలో చిరంజీవి
OTT ఫ్లాట్‌ఫామ్‌లోకి చిరంజీవి (File/Photos)


ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అందరి హీరోల ఆలోచనలు మారుతున్నాయి. మంచి కథ, కథనాలు ఉంటే వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్దం అంటున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా ఫ్లాట్‌ఫామ్‌లో చిరంజీవి కోసం ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. మరి చిరంజీవి వెబ్ సిరీస్‌లో నటింప చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఐతే ఈ వెబ్ సిరీస్ పట్టాలెక్కుతుందా లేదా అనేది లాక్‌డౌన్ తర్వాత తెలుస్తుంది. మొత్తానికి వెండితెరపై అలరించిన చిరంజీవి.. ఇపుడు వెబ్ సిరీస్‌కు  ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.
First published: May 7, 2020, 2:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading