Chiranjeevi - Sampath Nandi : చిరంజీవితో డైరెక్టర్ సంపత్ నంది భేటి.. సీటీమార్ డైరెక్టర్‌తో మెగాస్టార్ రచ్చ..

చిరంజీవి,సంపత్ నంది (Instagram/Photo)

Chiranjeevi - Sampath Nandi : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ సంపత్ నంది భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Chiranjeevi - Sampath Nandi : మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ సంపత్ నంది భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే..  చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దుమ్ము లేపుతున్నాడు. అంతేకాదు ఒకేసారి అర డజను దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ కోవలోనే ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది. ఆగష్టు మొదటి వారంలో ఈ  సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో చిరుకు జోడి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత చిరు.. లూసీఫర్ రీమేక్ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛంగా ప్రారంభమైంది.

    ఎపుడో పట్టాలెక్కాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యం అయింది. ఇక  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ పెడతామనుకున్నారు. కానీ ఒరిజినల్‌లో లాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటించడం లేదు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ కోసం చూస్తున్నారు.  ఈ సినిమా కథలో కీలకమైన చిరు సిస్టర్ పాత్రను ఎవరు చేస్తారనేది ఫైనల్ చేస్తారట.  అంతేకాదు ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిఫుణులను త్వరలో  ఫైనలైజ్ చేసి అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ఈ సినిమాకు పలు పేర్లు పరిశీలించిన చివరకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్టు సమాచారం.

    Chiranjeevi Remakes Megastar Done Many Remakes Before Lucifer Vedalam Here Are The List,Chiranjeevi Remakes: లూసీఫర్ కాకుండా చిరంజీవి తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..,Chiranjeevi,Megastar,Megastar Chiranjeevi,Chiranjeevi Remakes,Chiranjeevi Lucifer Remake,Vedhalam Remake,
    ‘లూసీఫర్’ రీమేక్‌లో చిరంజీవి (Twitter/Photo)


    ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో చిరంజీవి చాలా యేళ్ల తర్వాత తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమాను రీమేక్  చేస్తున్నారు. దాంతో పాటు పలువురు దర్శకులు చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ కోవలోనే దర్శకుడు సంపత్ నంది చెప్పిన కథకు చిరు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

    చిరంజీవి,సంపత్ నంది (Instagram/Photo)


    ఈ సందర్భంగా సంపత్ నంది చిరును కలిసి ఓ కథను వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా చిరుతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ రోజు తనకు ప్రత్యేకమైన రోజు. తన లాంటి ఎంతో మందికి దేవుడైన చిరును కలవడాన్ని ఎప్పటికీ మరవలేను అంటూ పేర్కొన్నారు.



    దీంతో వీళ్లిద్దరు కలయికలో సినిమా గ్యారంటీ అనే వార్తలకు బలం చేకూరింది. ప్రస్తుతం సంపత్ నంది.. గోపీచంద్‌తో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: