రామ్ చరణ్‌కు చిరంజీవి స్వీట్ వార్నింగ్.. చిరుతకు చిరు చురక..

రామ్ చరణ్‌కు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా సోషల్ మీడియా వేదికగా..

news18-telugu
Updated: May 2, 2020, 1:17 PM IST
రామ్ చరణ్‌కు చిరంజీవి స్వీట్ వార్నింగ్.. చిరుతకు చిరు చురక..
చిరంజీవి రామ్ చరణ్ (Twitter/Ram Charan Chiranjeevi)
  • Share this:
రామ్ చరణ్‌కు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అది కూడా సోషల్ మీడియా వేదికగా.. తాజాగా రామ్ చరణ్.. తన ఇంట్లో అమ్మ, నానమ్మ దగ్గర బట్టర్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చకున్నాడు. పెరుగు నుంచి వెన్న ఎలా తీయాలో నానమ్మ నుంచి రామ్ చరణ్ నేర్చుకున్న పాఠాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా రామ్ చరణ్.. నానమ్మ అంజనా దేవి దగ్గర వెన్న తీయడం నేర్చుకున్న విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా ప్రస్తావించారు. మై డియర్ బచ్చా మా అమ్మ దగ్గర బట్టర్ ఉడకదురా.. ఫస్ట్ ప్లేస్ ఎపుడు నాదే. అంటూ ట్వీట్ చేసాడు. మొత్తానికి చిత్ర పరిశ్రమలో ఎంతటి మెగాస్టార్ అయినా.. తల్లి దగ్గర కొడుకే కదా అన్నట్టు చిరంజీవి ట్వీట్ చేసారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇంకోవైపు రామ్ చరణ్.. ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా వచ్చే జనవరి 8న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలోఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

First published: May 2, 2020, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading