చిరంజీవి ఆత్మకథ.. కరోనా టైమ్‌లో కత్తిలాంటి నిర్ణయం..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కరోనా సెలవులను పర్ఫెక్టుగా వాడుకుంటున్నాడు. ముఖ్యంగా తన ఆత్మకథ రాయాలనుకుంటున్నాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2020, 7:33 PM IST
చిరంజీవి ఆత్మకథ.. కరోనా టైమ్‌లో కత్తిలాంటి నిర్ణయం..
చిరంజీవి వింటేజ్ ఫోటోస్ (chiranjeevi old photos)
  • Share this:
కరోనా హాలీడేస్ రావడంతో ఎవరికి ఏం చేయాలో తోచడం లేదు. అందుకే ఒక్కో స్టార్ ఒక్కోలా తమ టైమ్ కేటాయిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కరోనా సెలవులను పర్ఫెక్టుగా వాడుకుంటున్నాడు. ముఖ్యంగా తన ఆత్మకథ రాయాలనుకుంటున్నాడు ఈయన. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు చిరు. చాలా రోజుల నుంచి తన ఆత్మకథ రాయాలనుకుంటున్నాను కానీ టైమ్ దొరకడం లేదని చెప్పాడు మెగాస్టార్. ఇప్పుడు కావాల్సినంత టైమ్ దొరకడంతో దానిపై ఫోకస్ చేస్తానని చెప్పాడు అన్నయ్య. తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని వీడియో రూపంలో కూడా రికార్డు చేసుకుని భద్రపరుచుకున్నానని చెప్పాడు మెగాస్టార్.

చిరంజీవి వింటేజ్ ఫోటోస్ (chiranjeevi old photos)
చిరంజీవి వింటేజ్ ఫోటోస్ (chiranjeevi old photos)


ఇప్పుడు ఆత్మకథలా ఓ పుస్తకం రాసి అందులో కూడా తన అనుభవాలను దాచుకుంటానని చెబుతున్నాడు చిరు. ఇప్పటికే చిరు జీవితంపై చాలా మంది జర్నలిస్టులు పుస్తకాలు రాసారు. అందులో కొన్ని ప్రాచూర్యం కూడా పొందాయి. ఇప్పుడు స్వయంగా చిరు తన స్వహస్తాలతో ఆత్మకథ రాస్తానంటున్నాడు. దాంతో దీనికి చాలా క్రేజ్ కూడా వచ్చేయడం ఖాయం. ఆత్మకథ ఒక్కటే కాదు ఇంకా చాలా పనులు చేస్తున్నాని చెప్పాడు చిరంజీవి.

చిరంజీవి మెగాస్టార్ ది లెజెండ్ పుస్తకావిష్కరణ (chiranjeevi book launch)
చిరంజీవి మెగాస్టార్ ది లెజెండ్ పుస్తకావిష్కరణ (chiranjeevi book launch)
అప్పుడప్పుడూ వంట గదిలోకి వెళ్లి దోసెలు వేస్తున్నానని.. అలాగే పొద్దున్నే లేచి మొక్కలకు నీళ్లు పోస్తున్నానని.. టైమ్‌కు వ్యాయామం చేస్తున్నానని.. ఇంట్లో కూర్చుని పాత సినిమాలు చూస్తున్నానని.. ఇలా తన దినచర్య గడుస్తుందని చెప్పాడు మెగాస్టార్. దాంతోపాటే ఇప్పుడు ఆత్మకథ పని కూడా పెట్టుకున్నాడు మెగాస్టార్. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది తన ఆత్మకథను తీసుకొస్తానంటున్నాడు ఈయన. ఒకవేళ చిరు ఆత్మకథ వస్తే కచ్చితంగా దానికి సినిమా రూపం కూడా ఇస్తారేమో..?
First published: April 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading