MEGASTAR CHIRANJEEVI WANTS TO ME WITHDRAW FROM MAA ELECTIONS SAYS NEW PRESIDENT MANCHU VISHNU PK
Manchu Vishnu - Chiranjeevi: చిరంజీవి పోటీ నుంచి తప్పుకోమన్నారు.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..
మంచు విష్ణు చిరంజీవి (chiranjeevi manchu vishnu)
Manchu Vishnu - Chiranjeevi: మా అసోసియేషన్ ఎన్నికల తుది ఫలితాలు బయటికి వచ్చిన తర్వాత మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చాడు. ఆయనతో పాటు అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu - Chiranjeevi) కూడా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన గెలుపుకు సాయపడిన ప్రతీ ఒక్కరికి తలవంచి ధన్యవాదాలు తెలిపాడు విష్ణు.
మా అసోసియేషన్ ఎన్నికల తుది ఫలితాలు బయటికి వచ్చిన తర్వాత మోహన్ బాబు మీడియా ముందుకు వచ్చాడు. ఆయనతో పాటు అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తన గెలుపుకు సాయపడిన ప్రతీ ఒక్కరికి తలవంచి ధన్యవాదాలు తెలిపాడు విష్ణు. గెలుపు కోసం చాలా కష్టపడ్డామనే విషయం కూడా చెప్పుకొచ్చాడు ఈయన. పోలింగ్‌లో మా అధ్యక్షుడు, మరికొన్ని పోస్టులకు సంబంధించి మాత్రమే ఫలితాలు బయటికి వచ్చాయి. తాజాగా ఈసీ మెంబర్స్ జాబితాను కూడా విడుదల చేసారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్‌లో ఉన్న 18 మంది ఈసీ మెంబర్స్ లిస్టు చెప్పారు. ఈ క్రమంలోనే జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ప్రెస్ మీట్లో మంచు విష్ణు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. నాగబాబు, ప్రకాష్ రాజ్ చేసిన రాజీనామాలను కూడా ఆమోదించడం లేదని తెలిపాడు విష్ణు. అంతేకాదు.. తాను పోటీ చేస్తున్నానని చెప్పినపుడు మా ఎన్నికల్లో విత్ డ్రా చేసుకోమని చిరంజీవి తనకు సూచించారని మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేసాడు.
చిరంజీవి చెప్పిన తర్వాత కూడా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రకాష్ రాజ్‌పై పోటీకి దిగి అతన్నే ఓడించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు.. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ ప్రతీ ఒక్కరికి రుణపడి ఉంటాను.. ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి నన్ను గెలిపించడానికి వాళ్ల ఆశీర్వాదాలు అందించారు.. గెలిచే వరకు కూడా మా ప్యానల్ అందరం కష్టపడ్డాం.. కానీ మా ప్యానల్లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరంగా అనిపించింది. ప్రకాష్ రాజ్ ప్యానల్లో గెలిచిన సభ్యులను కలుపుకొని పోతాం.. మేమంతా ఒక్కటే.. వాళ్లతో పాటు కలిసి పని చేస్తాము.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. నాగబాబు కూడా మా అసోసియేషన్ కుటుంబంలో సభ్యుడే. అతడు చేసిన రాజీనామాను నేను ఆమోదించను. అలాగే ప్రకాష్ రాజ్ చేసిన రాజీనామాను కూడా ఆమోదించను. త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆ ఇద్దరితోనూ వెళ్లి మాట్లాడతా..’ అని తెలిపాడు విష్ణు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.