Chiranjeevi - Waltair Veerayya Hindi Trailer Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఆ తర్వాత థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను హిందీలో జనవరి 13న తెలుగుతో పాటు అక్కడ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా హిందీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక హిందీలో ట్రైలర్‌కు అనుకున్నంత రేంజ్‌లో రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. అక్కడ విడుదలై 24 గంటలైన 1 మిలియన్ వ్యూస్ రాబట్టలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు హీరో చిరంజీవి గొంతుకు వాయిస్ సెట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రీసెంట్‌గా బాలయ్య ‘అఖండ’ హిందీ ట్రైలర్‌కు ఇదే రకమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈ ట్రైలర్ హిందీలో 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఐదు రోజుల్లో 5 మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉంది. కానీ చిరు, రవితేజ నటించిన ‘వాల్తేరు వీరయ్య’కు తెలుగులో ఉన్నట్టు హిందీలో అంతగా బజ్ లేదు. ఈయన హిందీలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి, ఆ తర్వాత గాడ్ ఫాదర్’ సినిమాలకు కూడా నార్త్ బెల్ట్‌లో పెద్దగా రెస్పాన్స్ వచ్చింది లేదు. సల్మాన్ ఖాన్ ఉన్న ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. మరి ఇపుడు వాల్తేరు వీరయ్యగా తెలుగుతో పాటు హిందీలో ఏ మేరకు మెప్పిస్తాడనేది చూడాలి.
CHIRANJEEVI - RAVI TEJA: ‘WALTAIR VEERAYYA’ TO RELEASE IN *HINDI* SIMULTANEOUSLY… #GrandMaster and #B4U will release the HINDI version of #WaltairVeerayya on 13 Jan 2023 - day and date with the #Telugu release… #WaltairVeerayyaTrailer: https://t.co/yfnC20PCr8 pic.twitter.com/I3B8S7YV8E
— taran adarsh (@taran_adarsh) January 9, 2023
ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా విడుదల ట్రైలర్ చిరు అభిమానుల అభిరుచికి తగ్గట్టు కామెడీ, యాక్షన్ ప్లస్ డాన్స్ కలగలపి ఉంది. ముఖ్యంగా సినిమాలో చిరు వేసిన స్టెప్పులు మాస్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. మొత్తంగా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టేనర్‌గా వాల్తేరు వీరయ్య’ ఉంది. ఇప్పటికే యూఎస్‌లో ఈసినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అన్ని చోట్ల సూపర్ రెస్పాన్స్‌తో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.
వాల్తేరు వీరయ్యలో రవితేజ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇతను తెలంగాణ ప్రాంతానికి చెందిన పోలీస్ ఆఫీసర్‌గా వైజాగ్ కమిషనర్‌గా కనిపించనున్నారు. చిరు.. వాల్తేరు ప్రాంతానికి చెందిన వీరయ్యగా కనిపించనున్నారు. సినిమాలో రవితేజ, విక్రమ్ సాగర్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
ఇక లేటెస్ట్‌గా వస్తున్న వాల్తేరు వీరయ్యకు నైజాంలో మంచి బిజినెస్ జరిగింది. నైజాం ఏరియా వాల్యూ బిజినెస్ 18 కోట్ల రేంజ్‌లో అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. చూడాలి మరి చిరంజీవి నైజాంలో ఈసారి తన సత్తాను చాటి.. 20 కోట్ల షేర్ చేయాలనీ కోరకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగులో దాదాపు రూ. 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. హిందీలో ఓన్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తునివు ఉన్నాయి. విజయ్ అజిత్ ‘తెగింపు’ జనవరి 11న రిలీజ్ కానుంది. ఇక వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుంది. ఇక చిరు మూవీ ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న రానుంది. 14న వారసుడు తెలుగులో లేట్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు చిత్రాలు సంక్రాంతి బరిలో లైన్‌లో ఉన్నాయి. చూడాలి మరి ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా పండుగకు విజేతగా నిలవనుందో..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Chiranjeevi, Mythri Movie, Ravi Teja, Tollywood, Waltair Veerayya