Chiranjeevi - Vishal: మెగాస్టార్ చిరంజీవి‌తో విశాల్ నాన్న జీకే రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుసా..

చిరంజీవితో విశాల్ తండ్రి జీకే రెడ్డి నిర్మించిన సినిమా (File/Photo)

Chiranjeevi - Vishal: మెగాస్టార్ చిరంజీవి‌తో విశాల్ నాన్న జీకే రెడ్డి ఓ సినిమాను నిర్మించారు. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Chiranjeevi - Vishal: మెగాస్టార్ చిరంజీవి‌తో విశాల్ నాన్న జీకే రెడ్డి ఓ సినిమాను నిర్మించారు. వివరాల్లోకి వెళితే.. హీరో విశాల్ తండ్రి పలు తమిళ, తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసారు. ఆ తర్వాత నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. ఇక హీరోగా విశాల్ నటించిన తొలి చిత్రం ‘చెల్లమె’. ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత విశాల్ తండ్రి జీకే రెడ్డి తన సొంత బ్యానర్‌లో ‘సందెకోళి’ సినిమాను తెరకెక్కించారు. లింగుస్వామి దర్శకత్వంలో మీరా జాస్మిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో ‘పందెం కోడి’గా డబ్ చేసి రిలీజ్ చేస్తే.. ఇక్కడ కూడా ఓ రేంజ్‌లో సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత విశాల్ నటించిన మెజారిటీ చిత్రాలను తండ్రి జీకే రెడ్డి ఓన్ ప్రొడక్షన్‌లోనే చేసారు విశాల్.

    ఐతే.. విశాల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు ఎవరికీ పెద్దగా తెలియదు.కానీ ఈయన విశాల్ హీరో కాకముందు పలు చిత్రాలను తమిళంలో తెలుగులో నిర్మించారు. ఈయన మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ సినిమాను నిర్మించారు.

    Megastar Chiranjeevi Vishal Father G K Reddy Produced Film With Megastar Chiranjeevi In This Film Here Are The Details,Chiranjeevi - Vishal: మెగాస్టార్ చిరంజీవి‌తో విశాల్ నాన్న జీకే రెడ్డి నిర్మించిన ఈ సినిమా తెలుసా..,Megastar Chiranjeevi,Vishal Megastar Chiranjeevi GK Reddy,GK Reddy,Vishal Father GK Reddy Produce Film With Chiranjeevi SP Parasuram,SP Parasuram,Tollywood,Telugu cinema,Sridevi,kollywood,చిరంజీవి,విశాల్,విశాల్ తండ్రి జీకే రెడ్డి,జీకే రెడ్డి చిరంజీవి ఎస్పీ పరశురామ్,ఎస్పీ పరశురామ్ నిర్మాత విశాల్ తండ్రి జీకే రెడ్డి,జీకె రెడ్డి ప్రొడ్యూసర్ ఎస్పీ పరశురామ్
    తండ్రి GK రెడ్డితో విశాల్ (Twitter/Photo)


    ఆ మూవీ విషయానికొస్తే.. తమిళంలో సత్యరాజ్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్టర్ వెట్రివేల్’ సినిమాను తెలుగులో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా ‘ఎస్పీ పరశురామ్’ సినిమాను నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసారు.

    చిరంజీవి,శ్రీదేవిలతో విశాల్ రెడ్డి నిర్మించిన ’SP పరశురాం’(File/Photo)


    తెలుగులో ఈ చిత్రం  ఫ్లాప్‌గా నిలిచింది. మరోవైపు హిందీలో గోవిందా హీరోగా ‘ఖుద్దార్’ టైటిల్‌తో రీమేక్ చేసారు. అక్కడ మాత్రం ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మొత్తంగా జీకే రెడ్డి తెలుగులో ‘జగదేవవీరుడు అతిలోకసుందరి’ తర్వాత చిరంజీవి,శ్రీదేవి కాంబినేషన్‌లో జీకే రెడ్డి నిర్మించిన  ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రం నిరాశ పరిచింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: