ఈ విజయ దశమికి ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది చిరంజీవి, కొరటాల శివ. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ హీరోయిన్ను ముఖ్యపాత్రలో తీసుకోవాలనుకున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, విజయశాంతి జోడికి ఒకప్పుడు భలే క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరు కలిసి 19 సినిమాల్లో జోడిగా కలిసి నటించారు. వీళ్లిద్దరు కలిసి నటిస్తే సినిమా హిట్టే అన్నట్టు అప్పట్లో వీరిద్దరితో సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ఎంతో ఉత్సాహం చూపించేవారు. అంతేకాదు వీళ్లిద్దరికి విడి విడిగా వాళ్లకంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. ఇక విజయశాంతి విషయానికొస్తే.. ఒక వైపు బడా హీరోల సరసన నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ అమితాబ్గా ఆమెకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకుంది విజయశాంతి. ఇక వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘సంఘర్షణ’ సినిమాలో కలిసి నటించారు.

చిరంజీవి,విజయశాంతి
ఆ తర్వాత చిరు, విజయ శాంతిలు ‘
దేవాంతకుడు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘ఛాలెంజ్’,‘చిరంజీవి’,‘కొండవీటి రాజా’, ‘ధైర్యవంతుడు’, ‘చాణక్య శపథం’,‘పసివాడి ప్రాణం’, ‘స్యయంకృషి’, ‘మంచి దొంగ’, ‘యముడికి మొగుడు’, ‘యుద్ధభూమి’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘రుద్రనేత్ర’, ‘కొండవీటి దొంగ’, ‘స్టూవర్టుపురం పోలీస్స్టేషన్’, ‘గ్యాంగ్ లీడర్’, ‘మెకానిక్ అల్లుడు’ వంటి 19 సినిమాల్లో జోడిగా నటించారు.

చిరంజీవి,విజయశాంతి జోడిగా నటించిన చివరి సినిమా ‘మెకానిక్ అల్లుడు’(facebook/photo)
వీటిలో 10కి పైగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచాయి. ఇక 1993లో బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ తర్వాత వీళ్లిద్దరు మళ్లీ జోడి కట్టలేదు. అప్పట్లో విజయశాంతికి, చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయని అప్పట్లో ఫిల్మ్ నగర్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. దాంతో చిరంజీవి, బాలకృష్ణలు కలిసి విజయశాంతిని తమ సినిమాల్లో హీరోయిన్గా తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. ఆ తర్వాత విజయ శాంతి.. చిన్న చిన్న హీరోలతో ఆమె ప్రధాన పాత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక ‘ఒసేయ్ రాములమ్మ’ తర్వాత హీరోయిన్గా విజయశాంతి మార్కెట్ పడిపోతూ వచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇపుడు పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది.

చిరంజీవి, విజయశాంతి (file Photo)
తాజాగా విజయశాంతి.. చిరంజీవి సరసన హీరోయిన్గా నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో విజయశాంతి..చిరంజీవికి జోడిగా నటిస్తుందా లేకపోతే కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విజయశాంతి ఈ సినిమాలో నటిస్తే 26 ఏళ్ల తర్వాత మరోసారి చిరంజీవి,విజయశాంతిల జోడిని తెరపై చూడొచ్చు.
Published by:Kiran Kumar Thanjavur
First published:October 13, 2019, 14:21 IST