Megastar Chiranjeevi - Sai Pallavi: సాయి పల్లవి నా సినిమా రిజెక్ట్ చేసింది.. కానీ అది మంచిదే: మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi - Sai Pallavi

Megastar Chiranjeevi - Sai Pallavi:  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. ఈయన సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో.. ఈయన సినిమాలో నటించడానికి కూడా నటీనటులు అంతే ఆసక్తి చూపిస్తారు. కానీ అందరికీ అలాంటి అవకాశం రాదు అని చెప్పాలి.

  • Share this:
    Megastar Chiranjeevi - Sai Pallavi:  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికీ తెలిసిందే. ఈయన సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో.. ఈయన సినిమాలో నటించడానికి కూడా నటీనటులు అంతే ఆసక్తి చూపిస్తారు. కానీ అందరికీ అలాంటి అవకాశం రాదు అని చెప్పాలి. కానీ ఓసారి సాయి పల్లవికి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. చిరంజీవి తనను మాత్రం అస్సలు తన సినిమాలో నటించకూడదని అనుకున్నాడట.

    ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసింది. తన మాటలతో, నటనతో, డాన్సులతో ఇలా ప్రతి ఒక్క విషయంలో అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించగా త్వరలోనే విడుదల కానున్న లవ్ స్టోరీ సినిమాలో కూడా నటించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు.

    ఇక ఈ సినిమా గతంలోనే విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మొత్తానికి ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈరోజు ఈ సినిమా విడుదల ముందు వేడుకలను ఏర్పాటు చేశారు సినీ బృందం. ఈ కార్యక్రమం కు మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లతో పాటు నాగ చైతన్య, సాయి పల్లవి సినీ బృందం హాజరయ్యారు.

    ఇక చిరంజీవి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోవిడ్ సెలవుల తర్వాత విద్యార్థులు పాఠశాలకు వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ కార్యక్రమం కు వచ్చినందుకు కూడా అలాంటి అనుభూతి ఉందని తెలిపాడు. ఇక నిర్మాత నారాయణ దాస్ అంటే తనకు ఎంతో గౌరవమని.. ఆయనతో ఎప్పటినుంచో పరిచయం ఉందని తెలిపాడు. ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమా చూసేంత వరకు సాయి పల్లవి ఎవరో తెలియదు అని షాక్ ఇచ్చాడు.

    ఆ సినిమాలో తన డాన్స్ చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు. ఇక ఓ సినిమాలో సాయి పల్లవి కి తన సరసన అవకాశం వచ్చిందని అందులో చెల్లెలి పాత్ర గా నటించేందుకు సినీ బృందం అనుకుందని తెలిపాడు. కాని తనకు మాత్రంసాయి పల్లవి నటించవద్దు అని అనిపించిందట. అంతేకాకుండా తన ఒప్పుకోకూడదని మనసులో కూడా కోరుకున్నాడట. ఎందుకంటే అన్న చెల్లెలు గా నటించాలని తనకు ఇష్టం లేదని.. మంచి డాన్సర్ తో కలిసి తను డాన్స్ చేయాలనుకుంటున్నాను కానీ చెల్లెమ్మ ఎలా ఉన్నావు అని ఎలా అనగలను అంటూ తెలిపాడు చిరంజీవి. అంటే చిరంజీవికి సాయి పల్లవి తో నటించాలని కోరిక ఉందని తెలుస్తుంది.
    Published by:Navya Reddy
    First published: