Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI VENKATESH NAGARJUNA BIG MULTISTARER MOVIE NOT TO GO ON SETS DUE TO THESE REASONS TA

Chiranjeevi, Nagarjuna, Venkatesh: చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ మల్టీస్టారర్ ఎందుకు తెరకెక్కలేదంటే..

నాగార్జున, వెంకటేష్,చిరంజీవి (File/Photo)

నాగార్జున, వెంకటేష్,చిరంజీవి (File/Photo)

Chiranjeevi Nagarjuna Venkatesh Multistarer | తెలుగులో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ చరిత్రలో నిలిచిపోయే ఓ భారీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే..

Chiranjeevi Nagarjuna Venkatesh Multistarer | తెలుగులో ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ వంటి మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ చరిత్రలో నిలిచిపోయే ఓ భారీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత తెలుగు తెరపై ఇద్దరూ బడా మాస్ హీరోలు ఒకే సినిమాలో నటించడం అనేది ఈ సినిమాతోనే మొదలు. దాంతో పాటు పెద్ద, చిన్న హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీలు చేస్తున్నారు. ఐతే.. 2002లో తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేశారు కే.రాఘవేంద్రరావు. అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో భారీ మల్టీస్టారర్ మూవీని  తెరకెక్కించాలనుకున్నాడు. అది కూడా తన 100వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేలా ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నాడు దర్శకేంద్రుడు. అంతేకాదు అప్పట్లో ఈ మల్టీస్టారర్ మూవీకి చిన్నికృష్ణ ఓ కథను కూడా రెడీ చేసి దర్శకేంద్రుడి చేతిలో పెట్టాడు. అప్పటికే చిన్ని కృష్ణ, నరసింహా, నరసింహా నాయుడు, ఇంద్ర సినిమాలో ఫుల్ రైజింగ్‌లో ఉన్నాడు.   అంతేకాదు ఈ సినిమాకు ‘త్రివేణి సంగమం’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఈ చిత్రాన్ని కూడా మూడు హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో కథ, కథనాన్ని రెడీ చేసాడు.  అంతా ఓకే అనుకున్నాకా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్నారు. ఈ  భారీ మల్టీస్టారర్ మూవీని అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడుతో పాటు, అల్లు అరవింద్, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించడానికి రెడీ అయ్యారు.

chiranjeevi nagarjuna venkatesh multistarer movie cancelled due to these reasons,chiranjeevi,nagarjuna,venkatesh,k raghavendra rao,chinni krihsna,chiranjeevi nagarjuna venkatesh multistarer movie,chiranjeevi twitter,venkatesh twitter,nagarjuna twitter,k raghavendra rao twitter,tollywood,telugu cinemam,chiranjeevi nagarjuna venkatesh triveni sangamam,చిరంజీవి,నాగార్జున,వెంకటేష్,త్రివేణి సంగమం,చిరంజీవి నాగార్జున వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ,త్రివేణి సంగమం, చిరంజీవి,కే రాఘవేంద్రరావు,చిన్నికృష్ణ
చిరంజీవి,నాగార్జున,వెంకటేష్, (File/Photo)


ఐతే.. క్లైమాక్స్.. ఇతరత్రా కొన్ని సీన్స్ ‌తో అన్ని కుదరకపోవడం వల్లే ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోవడం జరిగింది. ఒకవేళ ఈ సినిమాను రాఘవేంద్రరావు తెరకెక్కించిగలిగితే... తెలుగులో అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ అయి ఉండేది. దర్శకేంద్రుడి  వంద చిత్రంగా చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మిగిలిపోయి ఉండేది. ఏమైనా ఒకే స్క్రీన్ పై చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లను చూడాలకున్న ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా తెరకెక్కకపోవడంతో నిరాశ తప్పలేదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Chinni Krishna, Chiranjeevi, K. Raghavendra Rao, Nagarjuna, Tollywood, Venkatesh

తదుపరి వార్తలు