news18-telugu
Updated: August 22, 2020, 9:08 AM IST
చిరంజీవి Photo : Twitter
మెగాస్టార్ చిరంజీవి.. తన నటన, డ్యాన్స్ తో పాటు సేవా హృదయంతో కోట్లాది అభిమానులను ఆకట్టుకున్న నటుడు. పునాదిరాళ్ళు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనకు పునాది వేసుకున్న చిరంజీవి.. ఆ తరువాత అంచలంచెలుగా ఎదుగుతూ ఖైదీ సినిమాతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మగధీరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకునక్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఇండస్ట్రీ మెగాస్టార్గా మారాడు. కొన్నాళ్లు సినిమాలకు విరామం ఇచ్చి.. 2009లో రాజకీయంలోకి ప్రవేశించాడు. ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే అక్కడ చిరు అనుకున్నంతగా అదరగొట్టలేకపోయాడు. దాదాపు ఓ ఏడేళ్ల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి 2017లో ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో మరోసారి.. తన సత్తా చాటాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకు అభిమానులు తగ్గలేదని ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిరూపించుకున్నాడు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాతో మరోమారు తన నట విశ్వరూపం చూపించిన మెగాస్టార్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152 వ సినిమా చేస్తున్నాడు. ఇక అందరికి తెలిసిందే ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు. ఆగష్టు 22 వ తేదీ వస్తే చాలు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల కోలాహలం మాములుగా ఉండదు. చిరంజీవి పుట్టినరోజునాడు ఆయన అభిమానులు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతుంటారు. కేకులు కట్ చేయడంలాంటీవి చేస్తుంటారు.
అయితే కరోనా కారణంగా మునపటి హంగామా ఉండకపోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ ఇండస్ట్రీలో పెద్దలు, ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు ట్విట్టర్లో #HBDMegastarChiranjeevi అంటూ పెద్ద ఎత్తున్న ట్రెండ్ అవుతోంది. చిరంజీవి ఆయుర్ ఆరోగ్యాలతో 100యేళ్లకు పైగా జీవించాలనీ.. తెలుగువారిని తన నటనతో, సేవాతో అలరించాలనీ.. అంతేకాదు ఆయన మరో 150 సినిమాలు చేయాలని న్యూస్ 18 కోరుకుంటోంది.
Published by:
Suresh Rachamalla
First published:
August 22, 2020, 8:17 AM IST