Upasana: మామయ్య చిరంజీవి చేసిన పనికి ఆశ్యర్యపోతున్న ఉపాసన..

Upasana Konidela | మామయ్య చిరంజీవి చేసిన పనికి ఉపాసన ఆశ్యర్యపోయింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 24, 2019, 2:16 PM IST
Upasana: మామయ్య చిరంజీవి చేసిన పనికి ఆశ్యర్యపోతున్న ఉపాసన..
ఉపాసన కొణిదెల (Twitter/Photos)
  • Share this:
Upasana Konidela: మామయ్య చిరంజీవి చేసిన పనికి ఉపాసన ఆశ్యర్యపోయింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఆదివారం చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే కదా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను రామ్ చరణ్ భారీ ఎత్తున తెలుగుతో పాటు హిందీ, తమిళ్,కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి కోడలు ఉపాసన హాజరైంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముందుగా చిరంజీవి... కోడలు ఉపాసనను ఫోటోలు తీసారు. ఈ ఫోటోల్లో చిరంజీవి ప్రతిబింబం కనిపిస్తోంది. చిరంజీవి తనను ఫోటో తీసిన విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.





ఈ సందర్భంగా ఉపాసన ట్వీట్ చేస్తూ.. నేషనల్ డాటర్స్ డేను సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తాను వేసుకున్న డ్రెస్ మామయ్యకు నచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ విషయమై నేను చాలా ఆనందంగా ఉన్నానిని చెప్పింది. ఈ సందర్భంగా చిరంజీవి దంపతులకు కోడలు కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కెరీర్ పరంగా వాళ్లు తనను ఎంతో ప్రోత్సహిస్తున్నారని చెప్పింది. ఇక ఉపాసన వేసుకన్న ఈ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసాడు.  మరోవైపు  తన భర్త రామ్ చరణ్ నిర్మాణంలో మావయ్య చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రిలీజ్ కోసం సామాన్య ప్రేక్షకుల వలే తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది.
First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>