చిరంజీవితో త్రివిక్రమ్.. మెగా కాంబినేషన్‌కు సర్వం సిద్ధం..

Megastar Chiranjeevi: చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనతో పని చేయడానికి చాలా మంది దర్శకులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ లాంటి కుర్ర దర్శకుడితో పని చేస్తున్నాడు చిరు. దీని తర్వాత కూడా వరసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 30, 2020, 2:36 PM IST
చిరంజీవితో త్రివిక్రమ్.. మెగా కాంబినేషన్‌కు సర్వం సిద్ధం..
చిరంజీవి రామ్ చరణ్
  • Share this:
చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనతో పని చేయడానికి చాలా మంది దర్శకులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఈ తరం దర్శకులు చిరుతో పని చేయాలని చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అందుకే ఆయన ఊ అనాలే కానీ కథ సిద్ధం చేస్తామంటూ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా కొరటాల శివ లాంటి కుర్ర దర్శకుడితో పని చేస్తున్నాడు చిరు. ఈ చిత్రం తర్వాత కూడా ఆయన వరస సినిమాలకు సిద్ధమవుతున్నాడు. అందులో అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ లాంటి దర్శకులు కథలు సిద్ధం చేస్తామని చెబుతున్నారు. ఇందులో ముందుగా త్రివిక్రమ్ వైపు ఆసక్తి చూపిస్తున్నాడు మెగాస్టార్.

చిరంజీవి రామ్ చరణ్ (Chiranjeevi Trivikram Srinivas)
చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Chiranjeevi Trivikram Srinivas)


అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టేసాడు మాటల మాంత్రికుడు. ఈ చిత్రంతో త్రివిక్రమ్ దశ మారిపోయింది. మరోసారి టాప్ 2లోకి వచ్చేసాడు. రాజమౌళి తర్వాత ఇప్పుడు తెలుగులో త్రివిక్రమ్‌కే అంత క్రేజ్ ఉంది. కచ్చితంగా హిట్ వస్తుందనే నమ్మకం ఉన్న దర్శకుడు ఈయనొక్కడే ఉన్నాడిప్పుడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు త్రివిక్రమ్. అయిననూ పోయి రావలే హస్తినకు.. అంటూ టైటిల్ కూడా రిజిష్టర్ చేయించాడు. ఈ చిత్రం జూన్ నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపు చిరు కూడా కొరటాల సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు.

చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొరటాల శివ (Chiranjeevi Trivikram Srinivas)
చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొరటాల శివ (Chiranjeevi Trivikram Srinivas)


ఇద్దరూ ఫ్రీ అయిన తర్వాత త్రివిక్రమ్, చిరంజీవి సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తుంది. అప్పట్లో వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తాను త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు చిరు. గతంలో చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రానికి త్రివిక్రమ్ కథ, మాటలు రాసాడు. అయితే దర్శకుడిగా మారిన తర్వాత మాత్రం పని చేయలేదు. మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్, బన్నీతో చెరో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్.. చరణ్, చిరంజీవితో మాత్రం ఒక్కసారి కూడా పని చేయలేదు. అందుకే ఇప్పుడు ఆ లోటు తీర్చేయాలని చూస్తున్నాడు మాటల మాంత్రికుడు. మరి అన్నీ కుదిరి నిజంగానే చిరు, త్రివిక్రమ్ కాంబినేషన్ వర్కవుట్ అయిందంటే మాత్రం బాక్సాఫీస్ బద్ధలైపోవడం ఖాయం.
First published: January 30, 2020, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading