Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI TO SHARE DAIS WITH PRIME MINISTER MODI SB

Chiranjeevi: చిరంజీవికి కేంద్రం నుంచి ఆహ్వానం.. మోదీ నుంచి స్పెషల్ కాల్.. !

చిరంజీవి , ప్రధాని మోదీ

చిరంజీవి , ప్రధాని మోదీ

ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందడం అంత సులభం కాదు.  కొంత మందికి మాత్రమే ఈ రకమైన ఆహ్వానం అందుతుంది. అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.

    మెగాస్టార్‌ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌` పేరుతో వేడుకలు నిర్వహిస్తుంది. దీని కోసమే చిరంజీవిని ఆహ్వానించడం విశేషం. అల్లూరి సీతారామరాజు 125వజయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జులై 4న నిర్వహించబోతున్నారు.

    ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆయన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అలాగే పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని చిరంజీవికి పంపిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చిరంజీవిని మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందడం అంత సులభం కాదు.  కొంత మందికి మాత్రమే ఈ రకమైన ఆహ్వానం అందుతుంది. అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. ఈ వార్తతో చిరు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



    అయితే ఇప్పటివరకు చిరంజీవి ఎప్పుడూ మోడీని కలిసింది లేదు. పలుసార్లు ఆయన మోదీతో భేటీ అవుతారని వార్తలు వచ్చినా అలాంటిదేం జరగలేదు. అయితే తాజాగా ఇప్పుడు మోదీతో నేరుగా చిరంజీవి ఒకే వేదికను పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజికీయాల్లో ఉన్నది తెలిసిందే. దీంతో పవన్ ఇప్పటికే మోదీని కలిశారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కోడలు...రాం చరణ్ సతీమణి ప్రధానితో సమావేశం అయ్యారు. వ్యాపార- సేవా రంగాల్లో ప్రముఖంగా నిలుస్తున్న ఉపాసన గతంతో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంలో ప్రస్తావించిన అంశాలతో జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధించారు.

    అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ గా కొణిదెల ఉపాసన తన తాత సూచించిన మార్గంలో అటు వైద్య రంగం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 'ఇండియన్ ఎక్స్‌పో 2020లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలుసుకున్నారు. దీనికి సంబందించిన అంశాలను ఉపాసన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నానని ఆమె తెలిపారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chiranjeevi, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు