కొరటాల శివ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ పై క్లారిటీ.. చాలా ఏళ్ల తర్వాత ఆ పాత్రలో మెగాస్టార్..

‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి ఒక పాత్రపై క్లారిటీ వచ్చింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 3, 2019, 5:59 PM IST
కొరటాల శివ చిత్రంలో చిరంజీవి క్యారెక్టర్ పై క్లారిటీ.. చాలా ఏళ్ల తర్వాత ఆ పాత్రలో మెగాస్టార్..
చిరంజీవి కొరటాల శివ ఫైల్ ఫోటో
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.దాదాపు తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తర్వాత చిరులో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు. ఇప్పుడు వ‌ర‌స చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ప్ర‌స్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అందుకోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. ఈ సినిమా తర్వాత  కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టులో చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుంది. ఈ  సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్ర నక్సలైట్ అని చెబుతున్నారు. మరోవైపు చిరు ఈ సినిమాలో ఉమెన్ హాకీ కోచ్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ క్యారెక్టర్ కోసం చిరంజీవి కేరళకు వెళ్లి బరువు తగ్గే పనిలో ఉన్నాడు. ఆ పాత్రలో చిరంజీవి నెరిసిన జుట్టుతో కనిపించనున్నట్టు సమాచారం. గతంలో చిరంజీవి ‘సింహపురి సింహం’, ‘బందిపోటు సింహం’, ‘రక్త సిందూరం’ వంటి సినిమాల్లో నక్సలైట్ తరహా పాత్రలో కనిపించాడు.  ఇపుడు చాలా ఏళ్ల తర్వాత నక్సలైట్ తరహాల విప్లవకారుని పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

chiranjeevi new movie with koratala siva will start from palasa which is in srikakulam district pk చిరంజీవి, కొరటాల సినిమా కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో వాళ్ల కోసమే సైరాను మరింత త్వరగా పూర్తి చేసి అది మొదలుపెట్టాలని చూస్తున్నాడు మెగాస్టార్. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi koratala siva shooting from palasa,chiranjeevi koratala siva palasa,sye raa shooting,sye raa movie twitter,sye raa instagram,chiranjeevi koratala movie shooting,koratala siva,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva movie,chiranjeevi new movie,chiranjeevi koratala siva movie updates,chiranjeevi next movie,chiranjeevi upcoming movie,megastar chiranjeevi,koratala shiva,koratala siva next movie,chiranjeevi and koratala siva movie,chiranjeevi new movie updates,chiranjeevi koratala siva movie teaser,chiranjeevi koratala siva combination,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,కొరటాల శివ షూటింగ్,చిరంజీవి షూటింగ్,సైరా షూటింగ్,తెలుగు సినిమా,చిరంజీవి సినిమా పలాస,చిరంజీవి కొరటాల శివ సినిమా పలాస
చిరంజీవి కొరటాల శివ


ఈ సినిమాను సైరా నరసింహారెడ్డి రిలీజైన తర్వాత షూటింగ్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో  ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార మరోసారి నటించే అవకాశం ఉంది.మరోవైపు మాజీ ప్రపంచ సుందరి ఐశ్యర్యా రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు జబర్దస్త్ అనసూయ కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మొత్తానికి కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఏదో సందేశం ఇచ్చినట్టుగానే..చిరంజీవితో చేయబోయే సినిమాలో కూడా ఒక సామాజిక సందేశం ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 3, 2019, 5:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading