కొరటాల శివ సినిమాలో చిరంజీవి పాత్రపై క్లారిటీ.. అనసూయ క్యారెక్టర్ పై వీడిన సస్పెన్స్..

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తర్వాత చిరులో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు.ఈ సినిమాలో చిరు ఒక పాత్రలో ఉమెన్ హాకీ కోచ్‌ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. మరోవైపు అనసూయ పాత్ర ఇదే అంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: July 18, 2019, 8:26 PM IST
కొరటాల శివ సినిమాలో చిరంజీవి పాత్రపై క్లారిటీ.. అనసూయ క్యారెక్టర్ పై వీడిన సస్పెన్స్..
మెగాస్టార్ చిరంజీవి,అనసూయ,కొరటాల శివ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.దాదాపు తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత తర్వాత చిరులో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు. ఇప్పుడు వ‌ర‌స చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ప్ర‌స్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఈ సినిమా తర్వాత  కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టులో చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22న ఈ  సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార మరోసారి నటించే అవకాశం ఉంది.మరోవైపు మాజీ ప్రపంచ సుందరి ఐశ్యర్యా రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Megastar Chiranjeevi fans unhappy with director Koratala Siva decision pk.. అదేంటి.. ఆయ‌నపై ఎందుకు కోపంగా ఉంటారు.. పైగా చిరంజీవి కోసం ఏడాది నుంచి మ‌రో సినిమా కూడా చేయ‌కుండా వేచి చూస్తున్నాడు.. అంత క్రేజ్ ఉన్నా కూడా మెగాస్టార్ కోస‌మే కాలం గ‌డుపుతున్నాడు క‌దా అనుకుంటున్నారా..? koratala siva,chiranjeevi,chiranjeevi koratala siva movie,chiranjeevi and koratala siva movie,chiranjeevi koratala siva movie updates,koratala siva movie with chiranjeevi,chiranjeevi new movie,chiranjeevi koratala siva,megastar chiranjeevi,koratala siva movies,chiranjeevi next movie,koratala siva chiranjeevi,koratala siva chiranjeevi movie,koratala siva chiranjeevi auto jaani,chiranjeevi upcoming movie,chiru koratala siva heroine fix,chiranjeevi and koratala siva movie latest news,chiranjeevi next movie,koratala and chiranjeevi movie updates,koratala siva next movie with chiranjeevi,chiranjeevi tamannaah,chiranjeevi nayanthara,chiranjeevi aishwarya rai,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి ఐశ్వర్యారాయ్,తెలుగు సినిమా,
చిరంజీవి ఐశ్వర్యారాయ్


అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. గతంలో కూడా చిరంజీవి కూడా ఎన్నో సినిమాల్లో డబుల్ రోల్లో యాక్ట్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే కదా.ఈ సినిమాలో చిరు ఒక పాత్రలో ఉమెన్ హాకీ కోచ్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. ‘చక్ దే ఇండియా’ తరహాలో  ఈ సినిమాలో అన్యాయానికి గురైన ఒక హాకీ ప్లేయర్ పాత్రలో చిరంజీవి నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు మరో క్యారెక్టర్ మాస్‌ను ఆకట్టుకునే పాత్ర అని చెబుతున్నారు.మొత్తానికి కొరటాల శివ తన ప్రతి సినిమాలో ఏదో సందేశం ఇచ్చినట్టుగానే..చిరంజీవితో చేయబోయే సినిమాలో కూడా ఒక సామాజిక సందేశం ఇవ్వనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో జబర్ధస్త్ అనసూయ కూడా ఉమెన్ హాకీ కోచ్‌లో ఆడే ఒక ప్లేయర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ విషయమై క్లారిటీ రావాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
First published: July 18, 2019, 8:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading