‘సైరా’ తరువాత మరో టార్గెట్ పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి

సైరా షూటింగ్ పూర్తయిన తరువాత మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ టార్గెట్ మరోలా ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సైరా షూటింగ్ ముగిసిన వెంటనే తన బాడీ లుక్‌ను మార్చుకోవడంపై చిరంజీవి ఫోకస్ పెట్టునున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: April 30, 2019, 8:12 PM IST
‘సైరా’ తరువాత మరో టార్గెట్ పెట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి
చిరంజీవి (ఫైల్ ఫోటో)
  • Share this:
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సాధ్యమైనంత తొందరగా గుమ్మడికాయ కొట్టేయాలని భావిస్తున్న చిరంజీవి... మే చివరినాటికి సైరా సెట్స్‌కు టాటా చెప్పడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఆ తరువాత సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టి... సినిమాను దసరా నాటికి ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాడు చిత్ర నిర్మాత రామ్ చరణ్. సైరా మూవీ మేకర్ల టార్గెట్ ఒకలా ఉంటే... మెగాస్టార్ చిరంజీవి టార్గెట్ మరోలా ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

సైరా షూటింగ్ ముగిసిన వెంటనే తన బాడీ లుక్‌ను మార్చుకోవడంపై చిరంజీవి ఫోకస్ పెట్టునున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సైరాలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం కాస్త బరువు పెరిగిన మెగాస్టార్... కొరటాల శివ డైరెక్షన్‌లోని సినిమా కోసం ఆ బరువు అంతా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఓ ఫారిన్ ట్రైనర్‌ను కూడా నియమించుకున్నారని... రెండు నెలల పాటు వెయిట్ లాస్ విషయంలో ఆయన చిరంజీవికి ట్రైనింగ్ ఇస్తారని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తన పట్టిన రోజు అయిన ఆగస్టు 22న కొరటాల శివ డైరెక్షన్‌లో కొత్త సినిమా మొదలుపెట్టాలని ఫిక్సయిన చిరంజీవి... అప్పట్లోగా సైరా కోసం పెరిగిన బరువును తగ్గించుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సైరా సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడంతో పాటు ఆ సినిమా కోసం పెంచిన బరువును తగ్గించుకోవడం కూడా చిరంజీవి టాప్ ప్రయారిటీగా కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: April 30, 2019, 7:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading