Chiranjeevi Acharya: ఆచార్య కోసం చిరంజీవి రంగంలోకి దిగేది అపుడే..

MegaStar Chiranjeevi Acharya Shooting Update | మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎపుడు ప్రారంభం అవుతుందంటే..

news18-telugu
Updated: November 5, 2020, 2:55 PM IST
Chiranjeevi Acharya: ఆచార్య కోసం చిరంజీవి రంగంలోకి దిగేది అపుడే..
చిరంజీవి (Chiranjeevi/Twitter)
  • Share this:
MegaStar Chiranjeevi Acharya Shooting Update | మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో  రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. ఐతే.. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ అన్ని సినిమాల్లోలాగే ఆగిపోయింది. ఇక కరోనా లాక్‌డౌన్ తర్వాత ఒక్కొక్క హీరో రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే నాగార్జున వంటి  సీనియర్ హీరో షూటింగ్ కోసం రంగంలోకి దిగాడు. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా కూడా ప్రారంభమైంది. కానీ బాలకృష్ణ.. ఈ నెల 15 నుంచి షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. అప్పటి వరకు వేరే నటీనటులకు సంబంధించిన షీన్స్‌ను పిక్చరైజ్ చేయనున్నాడు బోయపాటి శ్రీను. ఇక వెంకటేష్ కూడా నారప్ప కూడా రంగంలోకి దిగబోతున్నాడు. అటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ కోసం త్వరలో షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఇక చిరంజీవి ‘ఆచార్య’  సినిమా షూటింగ్ ఈ నెల 9 నుంచి మొదలు కానున్నట్టు ప్రకటించారు.

chiranjeevi twitter,kajal aggarwal twitter,kajal aggarwal acharya movie shooting,acharya movie,acharya movie updates,chiranjeevi koratala siva movie,acharya movie chiranjeevi,megastar chiranjeevi,chiranjeevi upcoming movie,chiranjeevi acharya,chiranjeevi movie updates,chiranjeevi latest movie news,acharya movie first look,chiranjeevi acharya movie,chiranjeevi acharya movie updates,telugu cinema,జనవరి నుంచి చిరంజీవి ఆచార్య షూటింగ్,చిరంజీవి కాజల్ అగర్వాల్ ఆచార్య షూటింగ్
కొరటాల శివ ఆచార్య (koratala siva acharya)


చిరంజీవి అప్పటి నుంచే ఈ సినిమా  షూటింగ్‌లో ఎప్పటి నుంచి పాల్గొనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రామ్ చరణ్ ముందుగా ఆర్ఆర్ఆర్ కంటే ముందు ఆచార్య షూటింగ్‌లో పాల్గొననున్నాడు. కాజల్ కూడా వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఈ సినిమా కోసం కాజల్ 20 రోజుల డేట్స్ కేటాయించింది. మరోవైపు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రష్మిక నటిస్తోంది. అంతేకాదు వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

ఆచార్యగా చిరంజీవి (Twitter/Photo)
ఆచార్యలో చిరంజీవి (Twitter/Photo)


చిరంజీవి ఓ వైపు ఆచార్య సినిమా చేస్తూనే పలువురు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పాడు.ఇప్పటికే చిరంజీవి... మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు.  ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ సినిమాకు రీమేక్. ఆ తర్వాత ఇద్దరు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పాడు. అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి.. ఏ దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళతాడా అనే సందిగ్ధం నెలకొని ఉండే. తాజాగా ఆ అనుమానాలకు తెరదించుతూ.. చిరంజీవి.. తన నెక్ట్స్ మూవీని తన కజిన్.. మెహర్ రమేష్ దర్శకత్వంలోనే చేయబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్టు సమాచారం.

చిరంజీవి, మెహర్ రమేష్ (File/Photo)


చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందివ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే మహతి ఇచ్చిన ‘ఛలో’, ‘భీష్మ’ సినిమాలోని పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే చిరంజీవి కూడా తన నెక్ట్స్ మూవీకి మహతిని సెలెక్ట్ చేసినట్టు సమాచారం. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 5, 2020, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading