మెగాస్టార్ చిరంజీవి దాదాపు 37 ఏళ్ల తర్వాత ఆ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి రెడీ ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి రీ ఎంట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో పాటు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలు చేసాడు. ఇపుడు ‘ఆచార్య’ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. ఆ తర్వాత బాబీతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. తాజాగా చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘సంఘర్షణ’ సినిమా చేసాడు. ఈ సినిమా 1983 డిసెంబర్లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో చిరంజీవితో మరో సినిమా చేయాలని రామానాయుడు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఏది కార్యరూపం దాల్చలేదు.
కానీ తాజాగా ఇపుడు బాబీతో చిరంజీవితో చేయబోయే సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కనున్నదని సమాచారం. చిరంజీవి తన రీ ఎంట్రీలో అన్ని సినిమాలను తన కొడుకు రామ్ చరణ్‌కు చెందిన కొణిదెల ప్రొడక్షన్స్‌లో చేస్తున్నాడు. అటు తన బావ మరిది అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ వారికి సినిమాలు నిర్మించడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అలాంటిది ఇపుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చిరంజీవి యాక్ట్ చేస్తాడా అనేది చూడాది. కానీ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ లో ముందుగా రామ్ చరణ్‌తో అనుకున్న పాత్రను రానాతో చేయించాలనే నిర్ణయానికి చిరంజీవి వచ్చినట్టు సమాచారం.
అందుకు బదులుగా తమ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయాలని కండిషన్ పెట్టినట్టు సమాచారం. మరోవైపు బాబీ కూడా ‘వెంకీ మామ’ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్‌లో మరో సినిమాకు సైన్ చేసాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌లో చేయనున్నాడు. ఒకవేళ చిరంజీవి సురేష్ ప్రొడక్షన్స్‌లో యాక్ట్ చేస్తే దాదాపు 37 ఏళ్ల తర్వాత ఆ బ్యానర్లో నటించినట్టు అవుతుంది. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Rana daggubati, Suresh Babu, Suresh Productions, Tollywood