పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అని అడక్కూడదు. ఎందుకంటే ఆయనకు కూడా క్లారిటీగా తెలియదు మరి. ఎప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు.. ఏ సినిమాకు డేట్స్ ఇస్తున్నాడు అనేది నిర్మాతలకు కూడా తెలియడం లేదు. ఒకటి రెండు కాదు.. అరడజన్ సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్. ఒకప్పుడు ఒక్క సినిమా చేస్తే చాలు అని కలలు కన్నారు అభిమానులు. కానీ ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడొస్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయాడు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న వకీల్ సాబ్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమా లైన్లో ఉంది. అయితే మధ్యలో దీనికి బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార్. 2021 సమ్మర్ తర్వాతే క్రిష్ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నాడు పవన్. దాంతో పాటు హరీష్ శంకర్ సినిమా కూడా లైన్లోనే ఉంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లోనే పట్టాలెక్కనుంది. సురేందర్ రెడ్డి కూడా పవన్ హీరోగా ఓ సినిమా చేయనున్నాడు. కానీ దీనికి కూడా టైమ్ ఉంది. 2022 తర్వాతే సురేందర్ రెడ్డి, పవన్ జోడీ కట్టనున్నారు. ఈ సినిమాలన్నింటి కంటే కూడా మరోటి ముందుకు దూసుకొచ్చింది. అదే అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్.

పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి (pawan kalyan and rana daggubati)
మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నారు. దీనికి చిరంజీవి క్లాసిక్ టైటిల్ బిల్లా రంగా పరిశీలిస్తున్నారు. అప్పట్లో చిరంజీవి, మోహన్ బాబు నటించిన బిల్లా రంగా మంచి విజయం సాధించింది. అదే టైటిల్ ఇప్పుడు పవన్ సినిమాకు పెడుతున్నారు నిర్మాతలు. ఇగో క్లాష్ కారణంగా ఈ సినిమా సాగుతుంది.

పవన్ కళ్యాణ్ రానా (Pawan Kalyan Rana)
ఒరిజినల్ బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. తెలుగులో బిజూ మీనన్ పాత్రలో పవన్.. పృథ్వీ పాత్రలో రానా కనిపించబోతున్నారు. సాయి పల్లవి ఇందులో కీలక పాత్రలో నటించబోతుంది. ఏదేమైనా కూడా అన్నీ అనుకున్నట్లు జరిగి పవన్ సినిమాకు మెగా టైటిల్ కన్ఫర్మ్ అయితే మాత్రం అభిమానులు పండగ చేసుకుంటారు.
Published by:Praveen Kumar Vadla
First published:December 22, 2020, 20:07 IST