Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI TESTED COVID POSITIVE AND HE IS NOW UNDER HOME QUARANTINE PK

Chiranjeevi Tested COVID Positive: చిరంజీవికి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌లో మెగాస్టార్..

చిరంజీవి కరోనా పాజిటివ్ (chiranjeevi corona)

చిరంజీవి కరోనా పాజిటివ్ (chiranjeevi corona)

Chiranjeevi Tested COVID Positive: కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీని కరోనా పట్టిపీడిస్తోంది. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Tested COVID Positive) కూడా కరోనా బారిన పడ్డారు.

ఇంకా చదవండి ...
కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీని కరోనా పట్టిపీడిస్తోంది. రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈయనకు పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు పాజిటివ్ వచ్చిందని.. స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డట్టు తెలియజేశారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సూచించారు మెగాస్టార్. కొన్ని రోజులుగా షూటింగ్స్ కూడా మానేసి ఇంట్లోనే ఉండిపోయారు చిరంజీవి.

అయితే మధ్యలో కొన్నిసార్లు మాత్రం బయట ఏదైనా ఈవెంట్స్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించినపుడు మాత్రం వెళ్లి వస్తున్నారు ఈయన. దాంతో పాటు ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు అంతా కలిసే ఉంటున్నారు. దర్శక నిర్మాతలతో పాటు కొందరు సినీ ప్రముఖులు చిరంజీవిని నిత్యం ఇంటి దగ్గర కలుస్తూనే ఉన్నారు. వాళ్లంతా వచ్చినపుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు చిరు. అయినా కూడా ఇప్పుడు ఈయనకు కరోనా అటాక్ అయింది.

లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని.. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు చిరంజీవి. అభిమానులకు ఎలాంటి కంగారు అవసరం లేదని చెప్పాడు ఈయన. ప్రస్తుతం చిరు వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆచార్య విడుదలకు సిద్ధం కాగా.. భోళా శంకర్, గాడ్ ఫాదర్ షూటింగ్ దశలో ఉన్నాయి. బాబీ సినిమాను కూడా ఈ మధ్యే మొదలుపెట్టాడు చిరంజీవి. ఇప్పుడు ఈయనకు కోవిడ్ కన్ఫర్మ్ కావడంతో మరికొన్ని రోజుల పాటు షూటింగ్ అనే మాటే లేకుండా పోయింది. కనీసం నెల రోజులైనా షూటింగ్స్‌కు దూరంగా ఉండబోతున్నాడు చిరంజీవి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Chiranjeevi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు