Sye raa: ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రీతిలో ‘సైరా’ థియేట్రికల్ బిజినెస్..

ప్రపంచ వ్యాప్తంగా చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ అదిరిపోయే బిజినెస్ చేసింది. ఏరియా వైడ్‌గా ఎక్కడ ఎంత బిజినెస్ చేసిందంటే..

news18-telugu
Updated: September 29, 2019, 9:38 PM IST
Sye raa: ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రీతిలో ‘సైరా’ థియేట్రికల్ బిజినెస్..
‘సైరా నరసింహారెడ్డి’ (File Photo)
news18-telugu
Updated: September 29, 2019, 9:38 PM IST
Sye Raa  : మెగాస్టార్ చిరంజీవి... ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత నటించిన చారిత్రక చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’.  ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  పాత్రలో నటించాడు. సైరాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. దాదాపు రూ.250 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో భారీగానే బిజినెస్ చేసింది.



నైజాంలో ఈ సినిమా నైజాం(తెలంగాణ)లో రూ.34 కోట్లు, సీడెడ్ (రాయలసీమ)లో రూ.21 కోట్లు, వైజాగ్ రూ. 14.5 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.10.4 కోట్లు, వెస్ట్ కోట్లు రూ.9.2 కోట్లు, కృష్ణ రూ. 9.6  కోట్లు, గుంటూరు రూ.11.50 కోట్లు, నెల్లూరు రూ.5.2 కోట్లు, మొత్తంగా తెలంగాణ, ఏపీల్లో రూ.115.4కోట్లు బిజినెస్ చేసింది. కర్ణాటకలో రూ.27 కోట్లు, తమిళనాడులో రూ.7.6 కోట్లు, కేరళలో రూ.2.5 కోట్లు,  హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిసి రూ.27.5 కోట్లు, ఓవర్సీస్ రూ.20 కోట్లు బిజినెస్ చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా సైరా నరసింహారెడ్డి రూ.200 కోట్ల బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.





ఈ  సినిమాలో చిరంజీవి సరసన నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాతో  హిందీ మెగా స్టార్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత  అమితాబ్ బచ్చన్‌  పాటు, తెలుగు నటుడు జగపతిబాబు, కన్నడ నటుడు సుదీప్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించారు.
First published: September 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...